కరోనా ఎఫెక్ట్... ఇల్లు ఊడ్చిన స్టార్ హీరోయిన్

దేశంలో లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన కత్రినా కైఫ్... ఇంట్లో ఎప్పుడూ చేయని పనులు చేస్తోంది.

news18-telugu
Updated: March 26, 2020, 8:53 PM IST
కరోనా ఎఫెక్ట్... ఇల్లు ఊడ్చిన స్టార్ హీరోయిన్
ఇల్లు ఊడ్చిన కత్రినా కైఫ్
  • Share this:
కరోనా ప్రభావంతో పేద, గొప్ప అనే తేడా లేకుండా అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఇంతకాలం సెలబ్రిటీలుగా ఉంటూ... క్షణం తీరిక లేకుండా ఉన్న వాళ్లు... ఇప్పుడు ఇంటిపట్టున ఉండాల్సి రావడంతో ఏం చేయాలో అర్థంకావడం లేదు. అందుకే ఇప్పటివరకు తాము ఎన్నడూ చేయని ఇంటి పనులు చేస్తున్నారు. వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఈ వివరాలను అందించడంలో ముందుంది. రెండు రోజుల క్రితం తన వంట గదిలో గిన్నెలు కడిగిన కత్రినా ఇప్పుడు చీపురు పట్టింది.

తన ఇంట్లో ఓ గదిని ఊడ్చింది కత్రినా. కత్రినా సోదరి ఇజాబెల్లే కైఫ్ దీన్ని వీడియో తీసింది. ఆ వీడియోను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘ఈ 21 రోజుల తొలి రోజిది. మేం మా పని చేస్తున్నాం. నేను ఊడుస్తుంటే ఇజాబెల్లే కూర్చొని కామెంటరీ ఇచ్చింది. కొన్ని సూచనలు కూడా చేసింది. కానీ, అవి పని చేయలేదు. ఏదేమైనా ఇది మంచి వ్యాయామం’ అని కత్రినా తెలిపింది. కొద్దిసేపటికే క్రికెట్‌ ఆడినట్టు.. చీపురును అటు ఇటు ఆడించింది. ఈ వీడియోకు ‘ఇంట్లో ఉండండి. ఇంటి పనుల్లో సాయం చేయండి’ అనే హాష్ ట్యాగ్ జత చేసింది.


First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు