అభిమానులకు, ప్రజలకు కార్తీక దీపం డాక్టర్ బాబు సందేశం..

Coronavirus Outbreak : కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్(డాక్టర్ బాబు) కూడా తన అభిమానులకు, ప్రజలకు విలువైన సందేశం ఇచ్చాడు. ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్‌ను దేశం నుంచి పారదోలుదామని పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: April 10, 2020, 12:10 PM IST
అభిమానులకు, ప్రజలకు కార్తీక దీపం డాక్టర్ బాబు సందేశం..
టీవీ యాక్టర్ నిరుపమ్ (కార్తీకదీపం ఫేమ్) (Facebook Photo)
  • Share this:
కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, మనల్ని మనం స్వీయ నిర్భందం చేసుకోగలిగితేనే ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. సెలబ్రిటీలు చెబితే కొందరు బాగా వింటారు. అందుకే వాళ్లే ముందుకు వచ్చి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ లాక్‌డౌన్ విధిగా పాటించాలని సూచిస్తున్నారు. తాజాగా, కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్(డాక్టర్ బాబు) కూడా తన అభిమానులకు, ప్రజలకు విలువైన సందేశం ఇచ్చాడు. ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్‌ను దేశం నుంచి పారదోలుదామని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు చెప్పిన సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉందామని అన్నారు.

‘అందరికీ నమస్కారం. నేను మీ నిరుపమ్‌ను. మనం ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఎవరిపై పోరాటం చేస్తున్నామో, రోజుకు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నామో మనం అందరం చూస్తున్నాం. మందు లేని ఒక వైరస్ మీద పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మనం చాలా వరకు సక్సెస్ అయ్యాం. ఎన్నో అగ్ర దేశాల కంటే బెటర్ పొజిషన్‌లో ఉన్నాం. ఇదిలాగే కంటిన్యూ చేస్తే మనం శాశ్వతంగా, సమూలంగా ఈ వైరస్‌ను మన దేశం నుంచి తరిమికొట్టినవాళ్లం అవుతాం. ఎవరో ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల కూడా ఈ వైరస్ ఇంకా పెరిగి, మనమంతా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. కాబట్టి ప్రభుత్వాలు సూచించినట్లుగా, ప్రధాని చెప్పినట్లుగా ఇంట్లోనే ఉందాం’ అని పిలుపునిచ్చారు. స్టే హోమ్.. స్టే సేఫ్.. ఇండియా విల్ ఫైట్ కరోనా అని అన్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 10, 2020, 11:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading