కర్నాటక సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్

కేంద్రహోంమంత్రి అమిత్ షాకు కూడా కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కోవిడ్ బారినపడ్డారు.

news18-telugu
Updated: August 3, 2020, 6:21 AM IST
కర్నాటక సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్
యడియూరప్ప
  • Share this:
భారత్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారినపడుతున్నారు. సీఎంల నుంచి కేంద్రమంత్రుల వరకు ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు. తాజాగా కర్నాటక సీఎం యడియూరప్ప(77)కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరానని ట్వీట్ చేశారు కర్నాటక సీఎం.


ఇటీవల తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్‌లో ఉండి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు యడియూరప్ప. శుక్రవారం గవర్నర్ వాజుభాయ్ వాలాను బెంగళూరులో ఆయన కలిశారు. ఆ సమావేశానికి మంత్రి బసవరావు బొమ్మై కూడా హాజరయ్యారు. నెల రోజుల క్రితం సీఎం కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కరోనా రావడంతో ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ యడియూరప్పకు కరోనా సోకింది.

కేంద్రహోంమంత్రి అమిత్ షాకు కూడా కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కోవిడ్ బారినపడ్డారు. కాగా, కర్నాటకలో ఇప్పటి వరకు 1,34,819 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి వీరిలో 57,725 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 2,496 మంది మరణించారు. ప్రస్తుతం కర్నాటకలో 74,590 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: August 3, 2020, 6:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading