కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఒక్క రోజులోనే..

వైరస్‌ను కట్టడి చేసేందుకు వారం రోజుల పాటు బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించినా... పెద్దగా ఫలితాన్ని ఇస్తున్నట్టు కనిపించడం లేదు.

news18-telugu
Updated: July 23, 2020, 9:35 PM IST
కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఒక్క రోజులోనే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్ణాటకలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు వారం రోజుల పాటు బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించినా... పెద్దగా ఫలితాన్ని ఇస్తున్నట్టు కనిపించడం లేదు. తాజాగా గురువారం ఒక్క రోజే కర్ణాటకలో 5030 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో బెంగళూరులోనే 2207 కేసులు ఉండటం గమనార్హం. ఇక ఒక్కరోజే రాష్ట్రంలో కరోనా కారణంగా 97 మంది చనిపోయారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటివరకు 1616 మంది మృత్యువాతపడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య 80863కి చేరినట్టు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

కరోనా నుంచి ఒక్క రోజే 2071 మంది కోలుకోవడం కొంత ఊరట కలిగించే విషయం. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 29310కి చేరుకుంది. ఇక మరణాల విషయంలోనూ బెంగళూరులోనే ఎక్కువగా ఉండటం కర్ణాటక రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. ఇవాళ నమోదైన కరోనా మరణాల్లో 48 బెంగళూరు అర్బన్‌లో ఉన్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: July 23, 2020, 9:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading