కర్ణాటకలో కరోనా సామాజిక వ్యాప్తి... మంత్రి ఆందోళన

కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 25 వేలు దాటిపోగా... కోవిడ్ మరణాల సంఖ్య 400 దాటింది.

news18-telugu
Updated: July 8, 2020, 2:36 PM IST
కర్ణాటకలో కరోనా సామాజిక వ్యాప్తి... మంత్రి ఆందోళన
ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)
  • Share this:
కర్ణాటకలో కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంది ఆ రాష్ట్ర మంత్రి జేసీ మధుస్వామి అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనతో ఉందని తూముకురు జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న మధుస్వామి వ్యాఖ్యానించారు. తుముకురు కోవిడ్ ఆస్పత్రిలో కరోనా సోకిన 8 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మధుస్వామి అన్నారు. వాళ్ల ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నట్టు సమాచారం వచ్చిందని అన్నారు. కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందనే ఆందోళన తమలో ఉందని అన్నారు. తుముకురు జిల్లాలో పరిస్థితి అదుపు చేయలేని విధంగా ఉందని ఆయన అన్నారు.

కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 25 వేలు దాటిపోగా... కోవిడ్ మరణాల సంఖ్య 400 దాటింది. రాష్ట్రంలో కొత్తగా బెంగళూరు అర్బన్‌లో 981 కేసులు, బళ్లారి 99, బెంగళూరు రూరల్ 68, ఉత్తర కన్నడ 81, హసన్ 49, మైసూరు 45, బీదర్ 44, ఉడిపి 40, మాండ్య 39, విజయపుర 36, యాద్గిర్ 35 కేసులు రికార్డయ్యాయి.

Published by: Kishore Akkaladevi
First published: July 8, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading