బార్బర్లు, ధోబీలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.5000 కరోనా సాయం

ప్రతీకాత్మక చిత్రం

రైతులు, పూల సాగు చేసే రైతులు, దోబీలు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, చేనేత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బార్బర్లకు సాయం అందించనున్నారు.

  • Share this:
    కరోనా వైరస్ వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించింది. రూ.1600 కోట్లతో ప్యాకేజీని సీఎం బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. దీని వల్ల రైతులు, పూల సాగు చేసే రైతులు, దోబీలు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, చేనేత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బార్బర్లకు సాయం అందించనున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఆయా రంగాలకు చెందిన వారు తీవ్రంగా నష్టపోయారని, ఈ ప్యాకేజీ వారికి కొంత ఉపశమనం కల్పిస్తుందని సీఎం యడియూరప్ప అన్నారు. మరోవైపు గతంలో బడ్జెట్ సందర్భంగా 6 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించారు. ఇప్పుడు మరో 11 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    లాక్ డౌన్ వల్ల పూలకు గిరాకీ లేకపోవడంతో పండించిన పూలను మొత్తం ధ్వంసం చేశారు. 11687 హెక్టార్లలో రైతులు పూలను సాగు చేశారు. ఒక్కో హెక్టార్‌కు రూ.25000 సాయం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ఒక హెక్టార్ వరకు మాత్రమే పరిహారం అందిస్తారు. అలాగే, కూరగాయలు, పండ్లు పండించి, వాటిని అమ్ముకోలేక ఇబ్బంది పడిన రైతుల కోసం రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. మరోవైపు 60వేల మంది దోబీలకు, 2,30,000 మంది బార్బర్లకు రూ.5000 సాయం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఒక్కసారి మాత్రమే ఇస్తారు. అలాగే, 7,75000 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు కూడా రూ.5000 సాయం చేస్తామని ప్రకటించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: