Corona Deaths: కరోనా మృతుల అంత్యక్రియల కోసం 200 ఎకరాలు సిద్ధం చేసిన ప్రభుత్వం

Corona Deaths: కరోనా మృతుల అంత్యక్రియల కోసం 200 ఎకరాలు సిద్ధం చేసిన ప్రభుత్వం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు పరిధిలో కరోనాతో చనిపోయిన అంత్యక్రియలు సజావుగా సాగేందుకు 200 ఎకరాలను సిద్ధం చేసింది. కురబరహళ్లి ప్రాంతంలోని 200 ఎకరాలలో కోవిడ్ మృతుల అంత్యక్రియలు నిర్వహించాలని...

  • Share this:
    బెంగళూరు: కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో భయాందోళనలు నెలకొన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,14,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో చెప్పకనే చెబుతోంది. కరోనా కేసులే కాదు మరణాలు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా భారత్‌లో 2,104 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక ఒకటి. కన్నడ నాట కరోనా కలకలం రేపుతోంది. బెంగళూరులో కరోనా మృతులకు అంత్యక్రియలు చేయడానికి చోటు లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. కరోనా మృతుల అంత్యక్రియలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు పరిధిలో కరోనాతో చనిపోయిన అంత్యక్రియలు సజావుగా సాగేందుకు 200 ఎకరాలను సిద్ధం చేసింది. కురబరహళ్లి ప్రాంతంలోని 200 ఎకరాలలో కోవిడ్ మృతుల అంత్యక్రియలు నిర్వహించాలని యడియూరప్ప ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేసేందుకు తొలుత ఆ ప్రాంత ప్రజలు అంగీకరించలేదు. వైరస్ సోకిన మృతదేహాలను తమ ప్రాంతానికి తీసుకొస్తే కరోనా తమకు కూడా సోకుతుందని భయాందోళన వ్యక్తం చేశారు. అయితే.. తర్వాత అధికారులు చర్చలు జరపడంతో ఎట్టకేలకు ఒప్పుకున్నారు. బుధవారం రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు.

    ఇక్కడ రెండు నెలల పాటు మాత్రమే ఇక్కడ అంత్యక్రియలు జరుపుతామని స్థానికులకు మంత్రి హామీ ఇచ్చారు. మృతదేహాలను పూడ్చి పెట్టడం లేదని, దహనం చేస్తున్నందు వల్ల వైరస్ సోకే అవకాశం లేదని.. కంగారు పడాల్సిన పని లేదని మంత్రి స్థానికులకు చెప్పారు. ఈ ప్రాంతంలో 200 ఎకరాలు సిద్ధం కావడంతో మరో రెండుమూడు రోజుల్లో కురుబరహళ్లి గోమాళ ప్రాంతంలో కరోనా మృతులకు అంత్యక్రియలు జరగనున్నాయి.

    బెంగళూరు నగర పరిధిలో విద్యుత్‌తో పాటు కట్టెలతో కాల్చే శ్మశాన వాటికలు మొత్తం 14 ఉన్నాయి. అయితే.. రోజుకు వందకు పైగా కరోనా మరణాలు నగర పరిధిలో నమోదవుతుండటంతో అంత్యక్రియలు జరపడం కష్టతరమైంది. స్మశానాల దగ్గర రోడ్ల పక్కన అంబులెన్స్‌లు బారులు తీరి ఉండటాన్ని చూస్తున్న నగర ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే.. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు పరిధిలోని కరోనా మృతుల అంత్యక్రియల కోసం 200 ఎకరాలను సిద్ధం చేసింది.
    Published by:Sambasiva Reddy
    First published: