వాళ్లకు రూ. 3 వేల ఆర్థిక సాయం.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటకలో కరోనా కల్లోలం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 30309 కొత్త కేసులు నమోదుకాగా, 525 మరణాలు వెలుగుచూశాయి.

  • Share this:
    కరోనా లాక్‌డౌన్‌లో రోజువారి పనులు చేసుకుని జీవనం సాగించే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు ప్రకటించాయి. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వారిని ఆదుకునేందుకు రూ. 1250 కోట్లతో కరోనా రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించారు కర్ణాటక సీఎం యడియూరప్ప. ఇందులో భాగంగా ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ. 3000, అసంఘటిత రంగ కార్మికులు రూ. 2000 అందించనున్నారు. రైతులకు కూడా ఆర్థికసాయం ప్రకటించింది కర్ణాటక సర్కార్.

    పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ. 10000 అందించనున్నట్టు సీఎం యడియూరప్ప తెలిపారు. మరోవైపు మే 24తో ముగియనున్న లాక్‌డౌన్‌ను మరికొద్ది రోజులు పొడిగించే ఆలోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉంది. ఇక మూడు కోట్ల వ్యాక్సిన్ డోసుల కొనుగోలు కోసం రూ. 1000 కోట్ల ఆర్డర్లు పెట్టినట్టు సీఎం యడియూరప్ప తెలిపారు. ఇక ఎస్టీఆర్ఎఫ్ నిధుల కింద ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 50000 అడ్వాన్స్‌గా ఇవ్వనున్నట్టు వివరించారు. ఇక కరోనా కట్టడి కోసం 2150 మంది డాక్టర్లను మూడు రోజుల్లో నియమిస్తామని అన్నారు. ఇదిలా ఉంటే కర్ణాటకలో కరోనా కల్లోలం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 30309 కొత్త కేసులు నమోదుకాగా, 525 మరణాలు వెలుగుచూశాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: