Yediyurappa: ఆస్పత్రిలో చేరిన కర్నాటక సీఎం యడియూరప్ప.. రెండోసారి కరోనా పాజిటివ్

Yediyurappa: ఆస్పత్రిలో చేరిన కర్నాటక సీఎం యడియూరప్ప.. రెండోసారి కరోనా పాజిటివ్

సీఎం యడియూరప్ప

78 ఏళ్ల యడియూరప్ప కరోనా బారినపడడం ఇది రెండోసారి. గత ఏడాది ఆగస్టులో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ట్రీట్‌మెంట్ తర్వాత కోలుకున్నారు. మళ్లీ 8 నెలల తర్వాత యడియూరప్పకు మరోసారి కరోనా సోకింది.

  • Share this:
    కర్నాటక సీఎం యడియూరప్ప ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవలే యడియూరప్పకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత నెగెటివ్ వచ్చింది. కానీ జ్వరం తగ్గకపోవడంతో మరోసారి కరోనా పరీక్షలు చేశారు. రిపోర్టులో మళ్లీ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే ఆయన్ను బెంగళూరులోని రామయ్య మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కాసేపటికే మణిపాల్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆస్పత్రిలో చేరడానికి ముందు సీఎం యడియూరప్ప.. అత్యవసరంగా కరోనా సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.




    78 ఏళ్ల యడియూరప్ప కరోనా బారినపడడం ఇది రెండోసారి. గత ఏడాది ఆగస్టులో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ట్రీట్‌మెంట్ తర్వాత కోలుకున్నారు. మళ్లీ 8 నెలల తర్వాత యడియూరప్పకు మరోసారి కరోనా సోకింది. రెండోసారి ఆయనకు వ్యాధి సోకడంతో పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఐతే తాను క్షేమంగానే ఉన్నానని.. డాక్టర్ల సలహా మేరకే ఆస్పత్రిలో చేరానని యడియూరప్ప తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.


    కాగా, కర్నాటకలో గురువారం 14,738 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 3591 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. నిన్న 66 మంది కన్నుమూశారు. కర్నాటకలో ఇప్పటి వరకు 11,09,650 కరోనా కేసులు నమోదవగా.. 9,99,958 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా బారినపడి 13,112 మంది మరణించారు. ప్రస్తుతం అక్కడ 96,580 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. ఎక్కువ మంది గుమిగూడ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం యడియూరప్ప అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 20న కరోనా వ్యాప్తిపై మరోసారి సమావేశం జరగనుంది. ఆ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు