హైవేపై గుర్రపు స్వారీ.. ఎమ్మెల్యే కుమారుడికి లాక్‌డౌన్ వర్తించదా..?

హైవేపై బీజేపీ ఎమ్మల్యే గుర్రపు స్వారీ

వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే కుమారుడి తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వీఐపీలకు నిబంధనలు పట్టవా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.

  • Share this:
    లాక్‌డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితయ్యారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావడం లేదు. కానీ కొందరు మాత్రం లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండానే సరదా కోసం రోడ్డుపైకి వస్తున్నారు. అంతేకాదు కొందరు వీఐపీల కుమారులు సైతం లాక్‌డౌన్ నిబంధనలను పట్టించుకోలేదు. కార్లు, బైకులతో రోడ్డుపై షికారు చేస్తున్నారు. ఐతే బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మగధీరంలో రామ్‌చరణ్ స్టైల్లో నడిరోడ్డుపై గుర్రపు స్వారీ చేశాడు. లాక్‌డౌన్ నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా.. హైవేపై గుర్రపు స్వారీ చేశాడు.

    కర్నాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట నియోజవర్గ బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ కుమారుడు భువన్... ఎంచక్కా గుర్రం ఎక్కి హైవేపై హల్ చల్ చేశాడు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డుపై చక్కర్లు కొట్టాడు. అంతేకాదు అతడి ముఖానికి కనీసం మాస్క్‌ కూడా లేదు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే కుమారుడి తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వీఐపీలకు నిబంధనలు పట్టవా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భువన్ లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు చేస్తున్నామని చామరాజనగర్ ఎస్పీ తెలిపారు. ఐతే దీనిపై స్పందించేందుకు ఎమ్మెల్యే నిరాకరించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: