హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

అక్కడ క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతి.. కండిషన్స్ అప్లై

అక్కడ క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతి.. కండిషన్స్ అప్లై

అయితే, కోర్టు తీర్పు రాకముందే అక్కడ 29,000 లీటర్ల మద్యం మిస్ అయినట్టు ఆజ్ తక్ రిపోర్టు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)

అయితే, కోర్టు తీర్పు రాకముందే అక్కడ 29,000 లీటర్ల మద్యం మిస్ అయినట్టు ఆజ్ తక్ రిపోర్టు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)

కర్నాటకలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 753కు చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 376 మంది కోలుకోగా.. 30 మంది మరణించారు.

  లాక్‌డౌన్ 3 సడలింపులతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. 40 రోజుల తర్వాత వైన్ షాపులు తెరచుకోవడంతో మందుబాబుల సందడి నెలకొంది. ఎక్కడ చూసినా భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో మద్యం లాగించేస్తున్నారు. ఐతే బార్లు, క్లబ్బులు, పబ్బులకు మాత్రం అనుమతి లేదు. భౌతిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో పలు రాష్ట్రాలు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అమ్ముతున్నాయి. ఐతే కర్నాటక ప్రభుత్వ మాత్రం క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతిచ్చింది. పాత లిక్కర్ స్టాక్‌‌ను అమ్ముకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే సిట్టింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. కేవలం టేక్ అవే సౌకర్యాన్ని మాత్రమే కల్పించింది. అంటే కేవలం మద్యం బాటిళ్లను మాత్రమే అమ్మాలి. అది కూడా ఎమ్మార్పీ ధరకే అమ్మాల్సి ఉంటుంది. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటారు.

  కాగా, కర్నాటక వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం... రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 48 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ 10 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ లెక్కలతో కలిపి కర్నాటకలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 753కు చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 376 మంది కోలుకోగా.. 30 మంది మరణించారు. కర్నాటకలో ప్రస్తుతం 347 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Karnataka, Liquor sales, Lockdown, Wine shops

  ఉత్తమ కథలు