బీద వాళ్ళను..ఆదుకుంటున్న పోలీసులు ..

తమవంతు చేయూతనందించేందుకు ముందుకు వచ్చిన శాంతి,సంక్షేమ కమిటి, రాబిన్‌హుడ్ సంస్థలకు చెందిన సభ్యులను అభినందించారు.

ఉపాధికరువై ఇబ్బందులు పడుతున్న వలస,దినసరి కార్మికులు, కడు బీదకుటుంబాలకు చెందిన ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు.

  • Share this:
    కరీంనగర్ జిల్లా: పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న శాంతి,సంక్షేమకమిటి పీప్లెండ్ వెల్ఫేర్) సహకారంతో పోలీసులు లాక్ డౌన్ అమలుతో ఉపాధికరువై ఇబ్బందులు పడుతున్న వలస,దినసరి కార్మికులు, కడు బీదకుటుంబాలకు చెందిన ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు. సోమవారంనాడు పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 3.5 లక్షల విలువచేసే 650కిట్లను అందజేశారు. తమవంతు చేయూతనందించేందుకు ముందుకు వచ్చిన శాంతి,సంక్షేమ కమిటి, రాబిన్‌హుడ్ సంస్థలకు చెందిన సభ్యులను అభినందించారు. బియ్యం, పప్పు, వంటనూనె, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, చక్కెర, ఛాయపత్తి, రెండుసబ్బులతో పాటు వివిధరకాల కూరగాయలు ఆనందించారు. గోపాలపురం గ్రామానికి చెందిన రైతు మంద రాజమల్లు తమవంతుగా 35వేల రూపాయల విలువచేసే 18క్వింటాళ్ళ కూరగాయలను ఉచితంగా అందజేశారు. పండించిన పంటను అమ్మడంతో పాటు వలన, దినసరికార్మికులు, కడు బీద కుటుంబాలకు ఉచితంగా కూరగాయలను అందించేందుకు ముందుకువచ్చిన రైతు రాజమల్లును ప్రత్యేకంగా అభినందించారు పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి. శాంతి,సంక్షేమకమిటి, రాబిన్‌హుడ్ సంస్థలకు చెందిన సభ్యులతో పాటు పోలీస్ కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన పోలీసు అధికారులు కొంత మొత్తాన్ని వ్యక్తిగతంగా అందజేశారు. ఇందులో భాగంగా గోదాంగడ్డలో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ వై సునీల్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీసులు రేయింబవళ్ళు అందించిన సేవల ద్వారానే వ్యాప్తిని నియంత్రించగలిగామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పోలీస్ కమీషనర్ ను అభినందించడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
    Published by:Venu Gopal
    First published: