Home /News /coronavirus-latest-news /

KAPPA COVID VARIANT CAN VACCINES EFFECTIVE AGAINST KAPPA ALL YOU NEED TO KNOW ABOUT THIS VARIANT GH SK

Kappa variant: ‘కప్పా’ ఇతర వేరియంట్ల కంటే ప్రమాదకరమా? వ్యాక్సిన్లు నిరోధిస్తాయా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kappa Variant: కప్పా వేరియంట్‌లో L453R మ్యుటేషన్ ఉంది. ఇది మన రోగనిరోధక ప్రతిస్పందన నుంచి తప్పించుకునే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు తేల్చారు. అయితే కప్పా వేరియంట్‌ తీవ్రత, దానిపై వ్యాక్సిన్ల ప్రభావాన్ని గుర్తించేందుకు కచ్చితమైన డేటా ప్రస్తుతం అందుబాటులో లేదు

ఇంకా చదవండి ...
దేశంలో కోవిడ్ ప్రభావం కొనసాగుతున్న వేళ, ఉత్తరప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసిన ‘కప్పా వేరియంట్’ కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ ఇతర దేశాల్లో తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. అనంతరం స్థానికంగా రూపాంతరం చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల పెరుగుదల కొనసాగుతుండగా, కొత్తగా కప్పా వేరియంట్ తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న కింగ్ జార్జ్ వైద్య కళాశాలలో 109 వైరస్ శాంపిల్స్‌ జన్యు క్రమాన్ని విశ్లేషించగా.. వాటిలో రెండు కప్పా వేరియంట్ కేసులు బయటపడ్డాయి. 107 శాంపిల్స్‌ డెల్టా ప్లస్ వేరియంట్‌కు చెందినవిగా గుర్తించారు.

కరోనా ఉత్పరివర్తనాల్లో కొత్తగా గుర్తించిన కప్పా వేరియంట్ శాస్త్రీయ నామం B.1.617.1. ఇది E484Q, L453R ఉత్పరివర్తనాలను కలిగి ఉన్న డబుల్ మ్యూటెంట్ వైరస్. అయితే ఇది కరోనావైరస్ కొత్త వేరియంట్ కాదని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో గత కొంతకాలంగా ఇది ఉనికిలో ఉన్నట్లు భావిస్తున్నారు.

* ప్రమాదకరంగా మరుతుందా?
కప్పా వేరియంట్ గత ఏడాది అక్టోబర్‌లోనే భారతదేశంలో బయటపడింది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 'దృష్టి సారించాల్సిన వేరియంట్‌'గా వర్గీకరించింది. భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్‌కు.. కొత్త మ్యుటేషన్ భిన్నంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. డెల్టాను WHO 'ఆందోళనకరమైన వేరియంట్'గా గుర్తించింది. అయితే కప్పా వేరియంట్‌ను మాత్రం ఈ జాబితాలో చేర్చలేదు.

ఉత్తరప్రదేశ్‌లో తాజాగా రెండు కప్పా వేరియంట్ కరోనా కేసులు బయటపడ్డాయి. దీని బారిన పడిన 66ఏళ్ల వ్యక్తి ఒకరు మరణించారని అధికారులు తెలిపారు. దీంతో ఈ వేరియంట్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీన్ని ఆందోళన రకంగా గుర్తించలేదని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్యంతో కొత్త వేరియంట్‌ను నిరోధించవచ్చని వైద్యాధికారులు తెలిపారు.

* కప్పా వేరియంట్‌ను వ్యాక్సిన్లు నిరోధిస్తాయా?
కప్పా వేరియంట్‌లో L453R మ్యుటేషన్ ఉంది. ఇది మన రోగనిరోధక ప్రతిస్పందన నుంచి తప్పించుకునే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు తేల్చారు. అయితే కప్పా వేరియంట్‌ తీవ్రత, దానిపై వ్యాక్సిన్ల ప్రభావాన్ని గుర్తించేందుకు కచ్చితమైన డేటా ప్రస్తుతం అందుబాటులో లేదు. అయితే కప్పా వేరియంట్‌కు వ్యతిరేకంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో సైతం.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కప్పా వేరియంట్ నుంచి రక్షిస్తుందని పేర్కొంది. అయితే వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా కోవిడ్ మార్గదర్శకాలను పాటిచడం ద్వారా.. దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Corona cases, Coronavirus, Covid-19, COVID-19 cases

తదుపరి వార్తలు