కనికా కపూర్‌కు కరోనా నెగిటివ్...

కనికా కపూర్‌కు ఐదోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

news18-telugu
Updated: April 4, 2020, 10:59 PM IST
కనికా కపూర్‌కు కరోనా నెగిటివ్...
కనికా కపూర్
  • Share this:
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌‌‌కు ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చింది. గతంలో నాలుగు సార్లు కరోనా పాజిటివ్ రిపోర్టులు వచ్చిన తర్వాత ఆమెకు నెగిటివ్ రావడం ఆమె కుటుంబం కొంచెం ఊపిరి పీల్చుకుంది. ‘బాలీవుడ్ సింగర్‌ కనికా కపూర్‌కు ఐదోసారి నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ రిపోర్టు వచ్చింది. మరోసారి పరీక్షల్లో నెగిటివ్ వచ్చే వరకు ఆమెకు లక్నోలోని పీజీఐ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తాం.’ అని వైద్యులు తెలిపారు. కనికా కపూర్‌కు మార్చి 20న తొలిసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత మార్చి 29న నాలుగోసారి ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు కరోనా వచ్చి ఉంటుందన్న అనుమానంతో ఇంట్లోనే ఉండాల్సిందిగా సంబంధింత అధికారులు సూచించినా, పట్టించుకోకుండా పలు హైఫై పార్టీలకు హాజరుకావడంతో ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
First published: April 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading