కనికా కపూర్‌‌కి ఐదోసారీ కరోనా పాజిటివ్... డాక్టర్లు ఏం చెప్పారంటే...

Corona Lockdown | Coronaupdate : బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కి ఐదోసారి కరోనా వైరస్ టెస్ట్ చెయ్యగా వరుసగా ఐదోసారి కూడా పాజిటివ్ వచ్చింది.

news18-telugu
Updated: March 31, 2020, 1:27 PM IST
కనికా కపూర్‌‌కి ఐదోసారీ కరోనా పాజిటివ్... డాక్టర్లు ఏం చెప్పారంటే...
కనికా కపూర్
  • Share this:
Corona Lockdown | Coronaupdate : ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్‌ని కరోనా వైరస్ అంత ఈజీగా వదలట్లేదు. ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి... ఐదోసారి టెస్ట్ చెయ్యగా... ఈసారి కూడా కరోనా పాజిటివ్ అనే వచ్చింది. ఒకసారి కరోనా సోకిన తర్వాత... ప్రతీ 48 గంటలకు ఓసారి టెస్ట్ నిర్వహిస్తారు. సాధారణంగా రెండుసార్లు పాజిటివ్ వచ్చినా... మూడోసారి నెగెటివ్ వస్తుంటుంది. కనికాను మాత్రం వైరస్ అంత ఈజీగా వదలట్లేదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్... లక్నోలో ఉన్న సంజయ్ గాంధీ ఆస్పత్రిలో ఆమెకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఐతే... సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా ఆమె ఆరోగ్యంగా వర్రీ అవ్వాల్సిన పనిలేదన్న డాక్టర్లు... ఆమె కండీషన్ నిలకడగా ఉందని తెలిపారు. ఆమె ఆహారం రోజూ లాగే తీసుకుంటున్నారన్న ప్రొఫెసర్ RK ధిమాన్...... ఆమె ఆరోగ్యం బాలేదని మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదని తెలిపారు.నాలుగోసారి పాజిటివ్ వచ్చాక... బేబీ డాల్ సింగర్... ఓ ఎమోషనల్ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన ఫ్యామిలీని మిస్సవుతున్నానన్న సింగర్... నెక్ట్స్ టైమ్ టెస్టులో నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నానని తెలిపింది. కానీ... ఈసారి కూడా నెగెటివ్ రాలేదు. 
View this post on Instagram
 

Thank you @judithleiberny Love my #Camera #bag 👜


A post shared by Kanika Kapoor (@kanik4kapoor) on

మార్చి 9న కనిక లండన్‌ నుంచి ఇండియా వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ హోటల్‌లో బస చేసింది. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను డిన్నర్ పార్టీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో కలకలం రేగింది. జ్వరం, దగ్గు రావడంతో ఆమె మార్చి 20న ఆస్పత్రిలో చేరింది. అప్పటి నుంచీ ఆమెకు ట్రీట్‌మెంట్ చేస్తున్నా... పరిస్థితిలో మెరుగుదల కనిపించట్లేదు. దీనిపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశం నుంచి వచ్చి... క్వారంటైన్‌లో ఉండకుండా పార్టీలు నిర్వహించినందుకు... పోలీసలు కనికాపై కేసు నమోదు చేశారు.
First published: March 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading