KAMAL HAASAN TURNS THE HOUSE INTO A HOSPITAL DUE TO CORONAVIRUS EFFECT TA
కరోనా వైరస్ నేపథ్యంలో ఏ హీరో చేయని పని చేసిన కమల్ హాసన్..
కమల్ హాసన్: 450 కోట్లు
కరోనా.. ఇపుడు పేరు చెబితేనే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇపుడు దేశా దేశాలనే చుట్టేస్తోంది. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో కమల్ హాసన్ చేసిన పనిని చూసి అందరు మెచ్చుకుంటున్నారు.
కరోనా.. ఇపుడు పేరు చెబితేనే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇపుడు దేశా దేశాలనే చుట్టేస్తోంది. అంతేకాదు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది. దీంతో అప్రమత్తమైన జనం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మన దేశంలోని అన్ని లాక్డౌన్ను ప్రకటించాయి. రైళ్లు, బస్సులు, విమానాలు ఎక్కడక్కడి క్కడ స్థంభించిపోయాయి. కరోనా దెబ్బకు బీదా, గొప్ప, ఆడా, మగా తేడా లేకుండా అందరు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు పరిశ్రమలు స్థంభించిపోయాయి. తాజాగా ప్రధాన మంత్రి కరోనా వైరస్ నియంత్రించేందకు దేశాన్ని మరో 21 రోజులు లాక్డౌన్లో ఉంచనున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్ ధాటికి సమస్తం షూటింగ్స్ సహా సినిమా షూటింగ్స్ సహా0 సమస్తం బంద్ అయ్యాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీని వల్ల పెద్ద కళాకారులకు ఏమి కాకపోయినా.. రోజు వారీ సినీ కళాకారుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ఇప్పటికే దక్షిణ భారత సినీ కళాకారులను ఆదుకోవడానికి పెద్ద హీరోలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే రజినీకాంత్ తన వంతు సాయంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు సూర్య,కార్తి, విజయ్ సేతుపతి వంటి హీరోలు కూడా తమ వంతుగా రూ.10 లక్షల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
రజినీకాంత్,సూర్య (Twitter/Photo)
తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్ పేద కళాకారులను ఆదుకునేందుకు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు హీరో ధనుష్ రూ. 15 లక్షలు, శంకర్ రూ.10 లక్షలను పేద కళాకారుల కష్టాలు తీర్చేందకు విరాళం ప్రకటించారు. మరోవైపు హీరో శివ కార్తికేయన్ రూ.10 లక్షలు, దర్శకుడు హరి 100 బస్తాల బియ్యం అందజేసారు. నిర్మాత దిల్లీ బాబు 20 కిలోల బియ్యాన్ని తన వంతు సాయంగా అందజేసారు. తమిళ సినిమా జర్నలిస్టు డైలీస్ అసోసియేషన్ తరుపున 100 కిలోల బియ్యం అందజేసారు. తాజాగా కమల్ హాసన్. కరోనా చికిత్స కోసం తన ఇంటవిని ఆసుపత్రిగా మార్చలనుకుంటున్నానని తెలిపారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేసారు. నా పార్టీ మక్కల్ నీది మయ్యం లోని వైద్యులతో కలిసి నా ఇంటిని హాస్పిటల్గా మార్చాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం అనుమతించాలని కోరారు. సినీ కార్మికులు చాలా మంది తమ కుటుంబ సభ్యలకు కనీసం భోజనం పెట్టలేకపోతున్నట్టు ఓ కార్మికుడు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ సౌత్ ఇండియా (పెఫ్సీ) అధ్యక్షుడైన రోజా భర్త ఆర్.కే.సెల్వమణికి ఓ కార్మికుడు ఫోన్ చేసి తమ ఆవేదనను వెల్లగక్కారు. ఈ నేపథ్యంలో సభ్యలందరు సినీ కార్మికులను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఆయన పిలుపుకు పలువురు స్పందించిన తమ వంతు ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.