కవిత భారీ పార్టీ... కేసీఆర్ ఆదేశాలు బేఖాతర్... వీడియో లీక్...

Kavitha Party | నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వంకుట్ల కవిత పెను దుమారానికి తెరతీశారు

news18-telugu
Updated: March 21, 2020, 2:34 PM IST
కవిత భారీ పార్టీ... కేసీఆర్ ఆదేశాలు బేఖాతర్... వీడియో లీక్...
మాజీ ఎంపీ కవిత (File)
  • Share this:
నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వంకుట్ల కవిత పెను దుమారానికి తెరతీశారు. ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణికిపోతున్నారు. ఎవరికి వారు సెల్ఫ్ క్వారంటైన్ (తమను తాముస్వీయ నిర్బంధం) చేసుకుంటున్నారు. ఒకరి నుంచి మరొకరికి సోకుతుందేమోనన్న భయంతో బయటకు కూడా రావడం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి పెళ్లిళ్లు కూడా రద్దు చేసుకోవాలని స్పష్టం చేశారు. తప్పనిసరి అయితే, అత్యధికంగా 200 మందిని మాత్రమే పిలిచి పెళ్లిళ్లు జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. తమ ఆదేశాలను ధిక్కరించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇన్ని సూచనలు చేస్తుంటే, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత మాత్రం సీఎం ఆదేశాలను ధిక్కరించారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కవిత... జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు (జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ) హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో విందు ఇచ్చారు. సుమారు 500 మంది వరకు ఈ విందుకు హాజరైనట్టు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కవిత తీరు మీద బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా స్పందించారు. ‘చెప్పేదొకటి చేసెదొకటి. అధికార దాహం. వారికి సామాన్యుడి ప్రాణం అంటే విలువ లేదు.’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి మెడకు కరోనా రాకుండా వాడే మాస్క్ ఉంది. ఆ సెల్ఫీ వీడియోలో చాలా మంది తెల్ల చొక్కాలు వేసుకుని ఉన్నారు. అందరూ పార్టీ చేసుకుంటూ ఉన్నారు. అందరూ పక్క పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీడియో తీసిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన 24వ వార్డు కౌన్సిలర్‌గా తెలుస్తోంది.
తెలంగాణలో ఇప్పటి వరకు 19 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కూడా రద్దయింది. విదేశాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను 14 రోజులు గృహనిర్బంధంలోనే ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలో కవిత భారీ పార్టీ ఇవ్వడం వివాదాస్పదమైంది.

First published: March 21, 2020, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading