హరీషన్నా కాపాడు.. మంత్రిని వేడుకున్న కరోనా బాధిత జర్నలిస్ట్

తన పరిస్థితి బాగాలేదని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని కంటతడిపెట్టారు శ్రీనివాసరెడ్డి. అపోలో ఆస్పత్రిలో ఒక బెడ్ ఇప్పించాలని సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి హరీష్ రావును కోరారు.

news18-telugu
Updated: July 8, 2020, 1:45 PM IST
హరీషన్నా కాపాడు.. మంత్రిని వేడుకున్న కరోనా బాధిత జర్నలిస్ట్
హరీషన్నా కాపాడు.. మంత్రిని వేడుకున్న కరోనా బాధిత జర్నలిస్ట్
  • Share this:
'అన్నా.. హరీషన్నా కాపాడు' అంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ మంత్రి హరీష్ రావును వేడుకున్నారు. డబ్బులు మేమే పెట్టుకుంటాం.. అపోలో ఆస్పత్రిలో బెడ్ ఇప్పించండన్నా అని సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. సీనియర్ జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఐతే తన పరిస్థితి బాగాలేదని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని కంటతడిపెట్టారు శ్రీనివాసరెడ్డి. అపోలో ఆస్పత్రిలో ఒక బెడ్ ఇప్పించాలని సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి హరీష్ రావును కోరారు.

హరీష్ అన్నా.. నేను రిపోర్టర్ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డిని. కరోనా పాజిటివ్ వచ్చిందన్నా. బాగా ఇబ్బంది అవుతోంది. లంగ్స్ కూడా ఏదో స్టేజీ దాటిందని చెబుతున్నారు. అపోలోలో బెడ్ ఇప్పించేలా చూడండి అన్నా. డబ్బులు మేమే పెట్టుకుట్టాం. మా కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు అన్నా. మాట్లాడడానికి కూడా వస్తలేదన్నా. ప్లీజ్ అన్నా.. అపోలోలో బెడ్ ఇప్పించు.
సిద్దిరెడ్డి శ్రీనివాస రెడ్డి


జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస రెడ్డి వీడియోపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆయన్ను గాంధీ ఆస్పత్రి నుంచి యశోదా ఆస్పత్రికి షిప్ట్ చేయించారు. శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్య విషయంలో యశోద హాస్పిటల్స్ డాక్టర్‌లతో మాట్లాడారు. అంతేకాదు తన వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్వర్ ద్వారా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇక ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రెడ్డి మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మంత్రి హరీష్ రావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మంత్రి చొరవతో సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని.. నిన్నటి కంటే ఇపుడు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. దీనిపై రాజకీయం చేయొద్దని మీడియాను కోరారు శ్రీనివాస రెడ్డి.
Published by: Shiva Kumar Addula
First published: July 8, 2020, 12:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading