ఏపీలో కరోనాతో మరో జర్నలిస్ట్ మృతి... తిరుపతిలోనే..

Tirupati Journalist Death | ఎన్టీవీ రిపోర్టర్ మధుసూధన్ రెడ్డి కరోనా వైరస్ కారణంగా కన్నుమూశాడు.

news18-telugu
Updated: July 17, 2020, 6:09 PM IST
ఏపీలో కరోనాతో మరో జర్నలిస్ట్ మృతి... తిరుపతిలోనే..
మధుసూదన్ రెడ్డి (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కారణంగా ఓ జర్నలిస్ట్ చనిపోయాడు. ఎన్టీవీ రిపోర్టర్ మధుసూధన్ రెడ్డి కరోనా వైరస్ కారణంగా కన్నుమూశాడు. ఆయనకు నాలుగు రోజుల క్రితం కరోనా వైరస్ నిర్ధారణ అయింది. కడప జిల్లాకు చెందిన మధుసూధన్ రెడ్డి తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కొన్ని రోజుల క్రితం తిరుపతిలోనే కరోనా కారణంగా ఓ ఛానల్ కెమెరామెన్ చనిపోయారు. ఓ న్యూస్ చానెల్‌లో వీడియో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న పార్థసారథి ఊపిరి పీల్చుకోలేని ప‌రిస్థితుల్లో మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. ఈ నెల 12న ఆయ‌న క‌న్నుమూశారు. గత ఇరవై ఏళ్లుగా వివిధ చానళ్లలో ఆయన కెమెరామెన్‌గా సేవ‌లందించారు.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఏపీలో ఉన్న వారికి 2592, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,646కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరిలో కరోనా సునామీ సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ జిల్లాలో అత్యధికంగా 24 గంటల్లోనే 634 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తర్వాత గుంటూరులో 367, చిత్తూరు 328, కర్నూలు 315 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురంలో 297, శ్రీకాకుళం 149, నెల్లూరు 127, పశ్చిమ గోదావరి 109, విజయనగరం 89, కడప 55, ప్రకాశం 53, కృష్ణా 37, విశాఖపట్నం జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 42 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం 6, చిత్తూరు 5, తూర్పుగోదావరి 5, ప్రకాశం 5, గుంటూరు 4, పశ్చిమ గోదావరి 4, కడప 3, విశాఖపట్నం 3, కర్నూలు 2, నెల్లూరు 2, విజయనగరం 2, కృష్ణాలో ఒకరు కరోనా వల్ల మరణించినట్టు ప్రభుత్వం తెలిపింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 17, 2020, 6:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading