Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ పై షాకింగ్ న్యూస్.. ఆగిన ట్రయల్స్

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందు వరుసలో ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో ట్రయల్స్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

news18-telugu
Updated: October 13, 2020, 10:59 AM IST
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ పై షాకింగ్ న్యూస్.. ఆగిన ట్రయల్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మానవాళికి ముప్పుగా మారిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ కోసం ప్రజలంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాదిలో వ్యాక్సిన్ తప్పనిసరిగా అందుబాటులోకి వస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో వ్యాక్సిన్ తయారీలో ముందు వరుసలో ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో ట్రయల్స్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాము నిర్వహించిన క్లీనికల్ ట్రయల్స్ లో పాల్గొన్న ఒకరు అస్వస్థతకు గురయ్యారని కంపెనీ ప్రకటించింది. దీంతో కరోనా వ్యాక్సిన్ పై మూడో దశ పరీక్షలతో పాటు అన్ని క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేశామని కంపెనీ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 60 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ కోసం చేపట్టిన ఆన్ లైన్ ఎన్ రోల్ మెంట్ ను సైతం నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఇంతటి భారీ అధ్యాయనాలు నిర్వహిస్తున్న ఏ క్లినికల్ ట్రయల్స్ లో అయినా ఇలాంటి తీవ్ర ప్రతికూల ఘటనలు ఊహించదగినవేనని జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ట్రయల్స్ ను నిలిపివేసి ఇందుకు గల కారణాలను పరిశీలించనున్నట్లు కంపెనీ తెలిపింది. అనంతరం వాక్సిన్ మానవ పరీక్షలను తిరిగి చేపడతామని చెప్పింది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 200 కేంద్రాల్లో 60 వేల మంది వాలంటీర్లపై మూడో దశ ట్రయల్స్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు సెప్టెంబర్ లో జాన్సన్ అండ్ జాన్సన్ వాలంటీర్ల రిక్రూట్ మెంట్ ను ప్రారంభించింది. వ్యాక్సిన్ ట్రయల్స్ లో నియమ నిబంధనలను పాటిస్తూ తాత్కాలికంగా ట్రయల్స్ ను నిలిపివేశామని, త్వరలోనే ట్రయల్స్ ను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సంస్థ ప్రతినిధి తెలిపారు.

ఒక డోస్‌ టీకా ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చాయని, ఈ వ్యాక్సిన్‌ కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే బలమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసినట్లు ఆ కంపెనీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆశలు రేకెత్తాయి. ప్రస్తుతం ఇలా ట్రయల్స్ నిలిచిపోవడం వ్యాక్సిన్ పై అనేక అనుమానాలకు తావిస్తోంది.  సెప్టెంబర్‌లో ఆస్ట్రాజెనెకాకు చెందిన వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ సైతం ఇదే మాదిరిగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాక్సిన్ తో ఎలాంటి ఇబ్బందులు లేవని తేలడంతో మళ్లీ ఆ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ను తిరిగి ప్రారంభించారు.
Published by: Nikhil Kumar S
First published: October 13, 2020, 10:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading