మంత్రికి కరోనా పాజిటివ్.. హోం క్వారంటైన్‌లో ఝార్ఖండ్ సీఎం

సీఎం అధికార నివాసంలోకి ఇతరుల ప్రవేశంపైనా నిషేధం విధించారు. ఇవాళ సీఎం హేమంత్‌తో పాటు కుటుంబ సభ్యులకూ కరోనా పరీక్షలు చేయనున్నారు.

news18-telugu
Updated: July 8, 2020, 3:06 PM IST
మంత్రికి కరోనా పాజిటివ్.. హోం క్వారంటైన్‌లో ఝార్ఖండ్ సీఎం
హేమంత్ సోరెన్
  • Share this:
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్వీయ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. రాష్ట్ర మంత్రి మిథిలేష్ ఠాకూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఐతే ఇటీవలే సీఎం హేమంత్ సోరెన్ కలిశారు. ఈ నేపథ్యంలో సీఎం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అటు సీఎం కార్యాలయంలోని అందరు అధికారులు, సిబ్బందిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. సీఎం అధికార నివాసంలోకి ఇతరుల ప్రవేశంపైనా నిషేధం విధించారు. ఇవాళ సీఎం హేమంత్‌తో పాటు కుటుంబ సభ్యులకూ కరోనా పరీక్షలు చేయనున్నారు.

కాగా, ఝార్ఖండ్‌లో ఇప్పటి వరకు 3,056 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 2,104 మంది కోలుకొని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. మరో 22 మంది మరణించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో 930 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Published by: Shiva Kumar Addula
First published: July 8, 2020, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading