హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Lockdown: దేశంలోని మరో రాష్ట్రంలో లాక్‌డౌన్.. ఎప్పటివరకు అంటే..

Lockdown: దేశంలోని మరో రాష్ట్రంలో లాక్‌డౌన్.. ఎప్పటివరకు అంటే..

ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Lockdown: లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులు, వాటికి అనుబంధంగా ఉన్న సర్వీసులు మినహా మిగిలిన వ్యాపారాలన్నీ మూసి ఉండనున్నాయి.

  కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దేశంలోని అనేక రాష్ట్రాలు పాక్షికంగానో, పూర్తిస్థాయిలోనే లాక్‌డౌన్‌లు విధించడం మొదలుపెడుతున్నాయి. నిన్న లాక్‌డౌన్ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా.. తాజాగా జార్ఖండ్ రాష్ట్రం కూడా లాక్‌డౌన్ బాటపట్టింది. రాష్ట్రంలో ఏప్రిల్ 22 నుంచి 29 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తసుకున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని పేర్కొంది. అత్యవసర సర్వీసులకు లాక్‌డౌన్‌లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.

  లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులు, వాటికి అనుబంధంగా ఉన్న సర్వీసులు మినహా మిగిలిన వ్యాపారాలన్నీ మూసి ఉండనున్నాయి. మతపరమైన ప్రార్థనా స్థలాలు తెలిచే ఉంటాయి కానీ, భక్తులకు అనుమతి ఉండదని జార్ఖండ్ సర్కార్ పేర్కొంది. వ్యవసాయ, మైనింగ్, నిర్మాణ రంగాల పనులు కొనసాగడానికి అనుమతి ఉంటుందని వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఇతర కార్యాలయాలు కూడా మూసి ఉంటాయని స్పష్టం చేసింది. ప్రజలెవరూ గుంపులుగా ఉండొద్దని..ఐదుగురికి మించి సమావేశం కాకూడదని తెలిపింది. ఇక జార్ఖండ్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సోమవారం కొత్తగా 3,992 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కొత్తగా కరోనాతో 50 మంది చనిపోయారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Coronavirus, Jharkhand, Lock down

  ఉత్తమ కథలు