Jayatu Jayatu Bharatam: 211 గాయకుల స్వరనీరాజనం...కరోనాపై పోరులో సంగీత ప్రపంచం...

దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన 200 మందికి పైగా గాయనీ గాయకులు ఐక్యమయ్యారు. ఈ కష్ట సమయంలో కుటుంబంగా కలిసి నిలబడి ప్రతి భారతీయుడికి ఈ పాట ద్వారా వందనం తెలియజేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన 200 మందికి పైగా గాయనీ గాయకులు ఐక్యమయ్యారు. ఈ కష్ట సమయంలో కుటుంబంగా కలిసి నిలబడి ప్రతి భారతీయుడికి ఈ పాట ద్వారా వందనం తెలియజేశారు.

  • Share this:
    కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడగానికి దేశంలోని గాయనీగాయకులంతా ఒక్కతాటిపై నిలబడి గీతాలాపన చేశారు. 'జయతు జయతు భారతం, వసుదేవ కుటుంబకం' అంటూ దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన 200 మందికి పైగా గాయనీ గాయకులు ఐక్యమయ్యారు. ఈ కష్ట సమయంలో కుటుంబంగా కలిసి నిలబడి ప్రతి భారతీయుడికి ఈ పాట ద్వారా వందనం తెలియజేశారు. ఆదివారం ఈ పాటను విడుదల చేశారు.

    భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి 200 మందికి పైగా గాయకులను ఒకచోట చేర్చుకోవడంలో ఇస్రా (ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్) ప్రముఖ పాత్ర పోషించింది. శంకర్ మహాదేవన్ స్వరపరచగా, ప్రసూన్ జోషి సాహిత్యాన్ని వ్రాశారు. సుప్రసిద్ధ లెజండరీ గాయని లతా మంగేష్కర్ సహా, దేశంలోని 211 మంది సింగర్స్ పాటపాడారు. 'జయతు జయతు భారతం' COVID-19 క్లిష్ట సమయాల్లో కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతి భారతీయుడికి 14 భాషల్లోని చారిత్రాత్మక గీతం ద్వారా వందన సమర్పణ అని ఇస్రా తెలపింది.

    ఈ పాట 14 వేర్వేరు భాషలలో ఉంది, గాయని ఆశా భోంస్లే సంస్కృతంలో పాడారు. ఈ పాటను ఆయా సింగర్స్ ఫోన్‌ ద్వారా రికార్డ్ చేశారు. మ్యూజిక్ డైరక్టర్స్ శ్రీనివాస్, శంకర్ మహాదేవ్, సంజయ్ తాండం నడుపుతున్న సెంట్రల్ కలెక్షన్ స్టేషన్‌కు అప్‌లోడ్ చేసి, ఆ తర్వాత రికార్డింగ్ ప్రక్రియను పూర్తి చేసి దానిని పాటగా అలంకరించారు. ఈ పాటను తెలుగులో ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ, ఎస్పీ చరణ్, మనో, సునీత ఉపద్రష్ట, కౌసల్య, పార్థసారథి, వేణు, సాందీప్, రవికాంత్, విజయలక్ష్మి, ఉష గాత్రం కలిపారు. ఈ గీతాన్ని నెట్ వర్క్ 18 సగర్వంగా సమర్పించింది.
    Published by:Krishna Adithya
    First published: