HOME »NEWS »Corona vilayatandavam »japan parliament passes bill to provide free corona vaccinations ms

Corona Vaccine: ఆ దేశంలో ప్రజలందరికీ కరోనా టీకా ఉచితం.. పార్లమెంటులో బిల్లు ఆమోదం

Corona Vaccine: ఆ దేశంలో ప్రజలందరికీ కరోనా టీకా ఉచితం.. పార్లమెంటులో బిల్లు ఆమోదం
ప్రతీకాత్మక చిత్రం

Corona Vaccine Updates: ప్రపంచవ్యాప్తంగా ఏడాది కాలంగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మాయదారి మహమ్మారి కరోనాకు వచ్చే ఏడాది వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో Japan దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించింది.

  • News18
  • Last Updated: December 02, 2020, 12:37 IST
  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నా.. మరోవైపు దానిని అంతమొందించడానికి టీకా ప్రయత్నాలు కూడా జోరందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలోని ఫార్మా సంస్థలు టీకా తయారీలో ముందున్నాయి. అందులో Oxford, moderna, pfizer, covisheld, bharath biotech, astrazeneca వంటివి ముందంజ లో ఉన్నాయి. ఇక భారత్ నుంచి కూడా భారత్ బయోటెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ తుది దశలో ఉంది. రష్యా తీసుకొచ్చిన స్పుత్నిక్-వి ఇప్పటికే మార్కెట్లోకి విడుదలవ్వగా.. చైనా కు చెందిన పలు టీకాలు కూడా అక్కడి మార్కెట్లలో లభ్యమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    ఇదిలాఉంటే టీకా వస్తే ముందు ఎవరికి ఇవ్వాలి..? దాని వల్ల లాభాలు.. నష్టాలు..? వంటి విషయాలపై ప్రపంచ దేశాలన్నీ తలలు పట్టుకుంటున్నాయి. ఒక దశలో ఇది పలు దేశాలలో ఎన్నికల ప్రచారాస్త్రం కూడా అయింది. ఇక తాజాగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై  జపాన్ సంచలన ప్రకటన చేసింది.



    తాజాగా జపాన్ పార్లమెంటు ఇదే విషయాన్ని సభ్యుల ముందు ఉంచింది. దీనిపై అక్కడి సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. జపాన్ వాసులంతటికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు కూడా అంగీకారం తెలిపారు. జపనీయులందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని.. అందుకయ్యే ఖర్చునంతటినీ ప్రభుత్వమే భరిస్తుందని జపాన్ ప్రధాని యోషిహిడె సుగా తెలిపారు. ప్రజలకు టీకా ను అందించే బాధ్యత స్థానిక ప్రభుత్వాల మీద పెట్టినట్టు ఆయన వివరించారు.

    కరోనా కారణంగా జపాన్ లో విధించిన లాక్డౌన్ తో అక్కడి ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. కేసులు, మరణాలు తక్కువగానే నమోదైనా.. వైరస్ వ్యాప్తిని నివారించడానికి అక్కడ లాక్డౌన్ విధించారు. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.  కాగా.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే దేశ ప్రజలకు వ్యాక్సిన్ తగినంత మోతాదులో అందజేస్తామని సుగా పార్లమెంటుకు తెలిపారు. అయితే జపనీయులందరికీ ఇస్తామని చెప్పిన సుగా.. అక్కడే నివసిస్తున్న విదేశీయుల గురించి మాత్రం ప్రస్తావించకపోవడం అనుమానాలకు దారి తీస్తుంది. జపాన్ లో ఉంటున్న విదేశీయులు స్వయంగా టీకాలు కొనుక్కోవాలా..? లేదా..? అని వారిలో సందేహాలు నెలకొన్నాయి. దీనిపై మరి కొద్ది రోజుల్లో స్పష్టత రానున్నది.
    Published by:Srinivas Munigala
    First published:December 02, 2020, 12:37 IST