హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

హీరోయిన్‌కు కరోనా వచ్చిందని బ్రేకప్ చెప్పిన ప్రియుడు..

హీరోయిన్‌కు కరోనా వచ్చిందని బ్రేకప్ చెప్పిన ప్రియుడు..

జేమ్స్ బాండ్ హీరోయిన్‌కు కరోనా (james bond olga kurylenko)

జేమ్స్ బాండ్ హీరోయిన్‌కు కరోనా (james bond olga kurylenko)

COVID-19: కరోనా రాకుండా ఇంత జాగ్రత్తగా ఉన్న నేపథ్యంలో జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు సినిమా వాళ్లకు కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే హాలీవుడ్‌లో టామ్ హ్యాంక్స్ దంపతులకు షూటింగ్ చేస్తుండగా కరోనా వచ్చింది. వాళ్లతో పాటు ఇండియాలో ఈ మధ్యే లండన్ నుంచి వచ్చిన సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. విద్యాసంస్థలు, పార్క్‌లు, జిమ్ములు, సినిమా థియేటర్లు, దేవాలయాలతో పాటు అన్నీ మూసేయాలని ఆజ్ఞాపించారు. సినిమా వాళ్లు కూడా తమకు తాముగా గృహ నిర్భందం చేసుకున్నారు.

జేమ్స్ బాండ్ హీరోయిన్‌కు కరోనా (james bond olga kurylenko)
జేమ్స్ బాండ్ హీరోయిన్‌కు కరోనా (james bond olga kurylenko)

ఇప్పటికే ప్రియదర్శి, ప్రభాస్, పూజా హెగ్డే, సోనమ్ కపూర్ లాంటి వాళ్లు ఇంట్లోనే హౌజ్ అరెస్ట్ చేసుకున్నారు. ఇంత జాగ్రత్తగా ఉన్న నేపథ్యంలో జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. పాజిటివ్ అని తేలిన తర్వాత తనకు డాక్టర్లు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారని.. ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదని చెప్పింది ఈమె. ఓల్గాకు కరోనా సోకిందని తెలిసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దాంతో ఈమె స్వయంగా తన అనుభవాన్ని చెప్తూ ప్రజలకు, అభిమానులకు సూచనలు ఇస్తుంది.

జేమ్స్ బాండ్ హీరోయిన్‌కు కరోనా (james bond olga kurylenko)
జేమ్స్ బాండ్ హీరోయిన్‌కు కరోనా (james bond olga kurylenko)

అలాగే తాను ఇంట్లో అందరికి దూరంగా ఉంటున్నానని.. కానీ కరోనా వైరస్‌ని ఎదుర్కొనడానికి మనవంతు ప్రయత్నం చేయాలని చెప్పింది ఓల్గా. విటమిన్ బీ5.. విటమిన్ ఈ.. విటమిన్ సీ.. జింక్ ఎంతగానో సహకరిస్తాయని.. ఇవి వాడిన తర్వాతే తనకు జ్వరం కూడా తగ్గిందని చెప్పింది బాండ్ గాళ్. కరోనాని ధైర్యంగా ఎదుర్కోవడాన్ని చూసి ప్రేక్షకులు కూడా ఆమెను అభినందిస్తున్నారు. ఓల్గాకి కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా ఆమెకు బ్రేకప్ చెప్పేసాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఈమె ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Coronavirus, Hollywood

ఉత్తమ కథలు