Home /News /coronavirus-latest-news /

JAMA MASJID TO REMAIN SHUT TILL JUNE 30 SHAHI IMAM BA

కరోనా ఎఫెక్ట్.. ఢిల్లీలోని జామా మసీదు మూసివేత...

జామా మసీదు (File)

జామా మసీదు (File)

ఈనెల 30 వరకు మసీదు మూసి ఉంటుందని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ చెప్పారు.

    కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదును మూసివేశారు. ఈనెల 30 వరకు మసీదు మూసి ఉంటుందని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ చెప్పారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు శరవేగంగా పెరుగుతున్న తరుణంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలంటూ ఈనెల 10న ఇమామ్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఏకంగా మసీదును ఈనెల 30వ తేదీ వరకు మూసి ఉంటుందని ప్రకటించారు. మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత అన్ని ప్రార్థన స్థలాలు మూతపడ్డాయి. సామూహిక ప్రార్థనలు నిర్వహించే వీలు లేదు. సుమారు రెండు నెలల తర్వాత కేంద్రం సడలింపులు ఇవ్వడంతో జూన్ 8వ తేదీ నుంచి మళ్లీ ప్రార్థన స్థలాలు తెరుచుకున్నాయి. జామా మసీదు కూడా సామూహిక ప్రార్థనలకు వేదికగా మారింది. మరోవైపు బుఖారీ సెక్రటరీ అమనతుల్లా మంగళవారం రాత్రి కరోనాతో సఫ్దర్‌గంజ్ ఆస్పత్రిలో చనిపోయాడు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Muslim Minorities, New Delhi

    తదుపరి వార్తలు