అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల.. కుక్కపిల్లా.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుంది ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్లను చూస్తుంటే. కామెడీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా ఇప్పుడు ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్‌ను కూడా కామెడీ చేస్తున్నారు. వాళ్ల పంచులతో కరోనా పేరుతో కూడా పిచ్చ కామెడీ చేస్తున్నారు. ప్రపంచమంతా దీన్ని చూసి వణికిపోతుంటే.. జబర్దస్త్‌లో మాత్రం దాన్ని కూడా కామెడీ చేసి పారేస్తున్నారు. మధ్యమధ్యలో పంచులు వేస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా ప్లే అయిన ఎపిసోడ్లో సునామీ సుధాకర్‌పై కరోనా జోక్ పేల్చేసాడు బుడ్డోడు నరేష్. వీడి ఫేస్ చూస్తే కరోనా కూడా కడుపు పగిలి చచ్చిపోతుంది అంటూ సెటైర్ వేసాడు.
దాంతో పాటు హైపర్ ఆది కూడా కరోనా వైరస్‌పై జోకులు పేల్చేసాడు. తన టీమ్ మెంబర్స్‌ను కరోనా వైరస్‌తో పోల్చేసాడు. ఇక మిగిలిన వాళ్లు ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ట్రెండింగ్‌లో ఉన్న కరోనాను తమ కామెడీ కోసం వాడుకుంటున్నారు కమెడియన్లు. అదిరిందిలో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. గల్లీ బాయ్స్ టీంలో సద్దాం హుస్సేన్ ఈ కరోనాతో కబడ్డి ఆడుకున్నాడు.
చైనా నుంచి కరోనా వచ్చిందంట.. దాన్ని చూసి అంతా పడి చచ్చిపోతున్నారు అని ఒకరంటే.. అంత పెద్ద ఫిగరా అది అంటూ సద్దాం జోక్ పేల్చేసాడు. కరోనా అంటే బాలీవుడ్ హీరోయిన్ కరీనా కాదురా అంటూ వెంటనే మరో పంచ్ వేస్తే దానికి బదులుగా తెలుసురా కరీనా అంటే ముంబై.. కరోనా అంటే చైనా అంటూ మరో పంచ్ వేసాడు. మొత్తానికి ప్రాణాలు తీస్తున్న భయంకరమైన వైరస్‌తో కూడా నవ్వులు పూయిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood