హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

రష్మీ పై ఓ నెటిజన్ అసభ్యకర కామెంట్స్.. గట్టిగానే ఇచ్చుకున్న జబర్థస్త్ బ్యూటీ..

రష్మీ పై ఓ నెటిజన్ అసభ్యకర కామెంట్స్.. గట్టిగానే ఇచ్చుకున్న జబర్థస్త్ బ్యూటీ..

రష్మి గౌతమ్ (Image: Rashmi Gautam/Facebook)

రష్మి గౌతమ్ (Image: Rashmi Gautam/Facebook)

తాజాగా రష్మీ కరోనా పై చేసిన ట్వీట్ పై ఓ నెటిజన్ ఇచ్చిన రెస్పాన్స్ ...దానికి రష్మీ చెప్పిన సమాధానం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. కేవలం నటిగా, యాంకర్‌గా పరిమితం కాకుండా సామాజిక సమస్యలపై స్పందింస్తూ ఉంటుంది.  అంతేకాదు సోషల్ మీడియాలో సామాన్యులకు ఎపుడు అందుబాటులో ఉంటూ వారిచ్చే సలహాలు సూచనలు స్వీకరిస్తూ ఉంటుంది. ఎవరైనా అతి చేస్తే సోషల్ మీడియా వేదికగా ఉతికి పారేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ నెట్‌ వర్కింగ్ సైట్స్ అందుబాటులోకి వచ్చాకా...  సామాన్యులకు, బ్రిటీల మధ్య దూరం చెరిగిపోయింది. ఆన్ లైన్ వేదికగా ఉపయోగించుకుంటూ తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటున్నారు. ఇటు సెలబ్రిటీలకు మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఆన్‌లైన్ వేదికగా సెలబ్రిటీలు సందేశాలు పెట్టడం సులువైపోయింది. దానికి నెటిజన్లు అదే రీతిలో రెస్పాన్స్ అవుతున్నారు. తాజాగా రష్మీ కరోనా పై చేసిన ట్వీట్ పై ఓ నెటిజన్ ఇచ్చిన రెస్పాన్స్ ...దానికి రష్మీ చెప్పిన సమాధానం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రష్మీ గౌతమ్.. కర్ోనా వైరస్‌ను ప్రస్తావిస్తూ ఓ ట్వట్ చేసింది. దానికి ఓ నెటిజన్ అది ముఖ్యంగా కాదన్నట్టుగా కామెంట్ చేశాడు. అంతేకాదు రష్మీకి సంబంధించిన కొన్ని అభ్యంతకర ఫోటోలను పోస్ట్ చేసాడు.

అంతేకాదు ఆమె షోలో వేసుకునే డ్రెస్ వరకు అన్నింటిపై కామెంట్ చేసాడు. దీనికి రష్మీ బదులిస్తూ.. మిమ్మల్ని ఎవరు కాళ్లు చేతులు కట్టి బలవంతంగా టీవీ ముందుర కూర్చోబెట్టడం లేదుగా. మీకు మేము నచ్చనపుడు మీరు రిమోట్‌తో ఎంచక్కా వేరే ఛానెల్‌ చూడొచ్చు అని కామెంట్ చేసింది. ఒకవేళ మీరో సినిమా తీస్తే అందులో సతీ సావిత్రి పాత్ర కోసం నన్ను తీసుకోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదంది. ఏ షో  హిట్ కావాలంటే ఎంతో మంది శ్రమ దాగుంటుంది. ముఖ్యంగా ప్రేక్షకులు మమ్నల్ని స్వీకరించిన విధానంతోనే మేము ఫిదా అయిపోతాము. ప్రపంచ వ్యాప్తంగా అందరు కరోనా పై మాట్లాడుతుంటే.. మీరు మాత్రం నా డ్రెస్సింగ్ సెన్సు వాటిపై మాట్లాడి సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కామెంట్ చేసింది.

అంతేకాదు ఒక విదేశీయుడి ఫోటోను ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకొని భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి నువ్వు మాట్లాడటం ఏంటని ప్రశ్నించింది. దానికి అతడు నేను ఎవరి ఫోటో పెట్టుకుంటే నీకేంటి అని రష్మీని ప్రశ్నించాడు. దానికి రష్మీ సమాధానం చెబుతూ.. కరోనా వైరస్‌కు నేను చేస్తోన్న టీవీ షోకు సంబంధం ఏంటని ఎదురు ప్రశ్నించి సదరు నెటిజన్‌ నోరు మూయించింది.

First published:

Tags: Coronavirus, Covid-19, Jabardasth comedy show, Rashmi Gautam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు