హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

బాధ్యత ఉండక్కర్లా.. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్‌పై నెటిజన్స్ ఫైర్..

బాధ్యత ఉండక్కర్లా.. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్‌పై నెటిజన్స్ ఫైర్..

రష్మి గౌతమ్ Instagram/rashmigautam

రష్మి గౌతమ్ Instagram/rashmigautam

Rashmi Gautam: ఎప్పుడు బాధ్యతగా మాట్లాడటంలో రష్మి గౌతమ్ ముందుంటుంది. తనలో చాలా సామాజిక బాధ్యత కూడా ఉందని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోయింది.

ఎప్పుడు బాధ్యతగా మాట్లాడటంలో రష్మి గౌతమ్ ముందుంటుంది. తనలో చాలా సామాజిక బాధ్యత కూడా ఉందని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోయింది. ఓ వైపు కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే స్థంభించిపోతుంది. ఎప్పుడు ఎవరు బయటికి వచ్చినా కూడా ఏమవుతుందో అని భయపడుతున్నారు జనాలు. కనీసం పదిమంది కలిసి ఒకేచోట కనిపించినా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తామంటున్నారు. మార్చ్ 31 వరకు పెళ్లిళ్లు, గుళ్లు, మసీదులు కూడా మూసేసారు. జనం బయటికి రాకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఇప్పుడు రష్మి గౌతమ్ మాత్రం తను ఓ షాప్ ఓపెనింగ్‌కు వస్తున్నాను.. మీరు కూడా రండి అంటూ అభిమానులకు ఆహ్వానం పలుకుతుంది.

బయట కరోనా వైరస్ ఉందనే విషయాన్ని కూడా ఈమె మర్చిపోయినట్లుంది.. అందుకే ఏకంగా నేను వస్తున్నాను.. మీరు కూడా వచ్చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇది చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. బయటకి వెళ్లడానికే భయపడుతున్న జనాన్ని.. తను వస్తున్నాను రమ్మని పిలుస్తుంది రష్మి గౌతమ్. మార్చ్ 20న రాజమండ్రిలో లెనిన్ హౌజ్ ఓపెనింగ్‌కు వస్తుంది రష్మి. దీనికోసం ప్రత్యేకంగా వీడియో బైట్ కూడా ఇచ్చింది ఈమె. ఇది చూసి నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.

రష్మి గౌతమ్‌కు నెటిజన్స్ ప్రశ్నలు
రష్మి గౌతమ్‌కు నెటిజన్స్ ప్రశ్నలు

ఓ వైపు కరోనా భయంతో జనాలు గుమిగూడొద్దు అంటూ ప్రభుత్వం హెచ్చరిస్తుంటే.. అందర్నీ రమ్మంటున్నావ్.. బాధ్యత ఉండక్కర్లా రష్మి నీకు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరిచిపోయి పిలిచిందా.. కరోనా మననేం చేస్తుందిలే అని లైట్ తీసుకుంటుందో తెలియదు కానీ రష్మి చేసిన పనికి మాత్రం ఇప్పుడు విమర్శలు భారీగానే వస్తున్నాయి.

First published:

Tags: Anchor rashmi gautam, Coronavirus, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు