ఇటలీలో ఎక్కువ మరణాలకు అసలు కారణం ఇదే...

ఇటలీ, స్పెయిన్‌ వంటి ఇతర యూరప్ దేశాల్లో 60 సంవత్సరాలు వయసు దాటిన వారు దాదాపు 50 శాతానికి పైగా ఉన్నారు. అటు జర్మనీలో 60 ఏండ్లు పైబడిన వారు కేవలం 20 శాతం మంది ఉన్నారు.

news18-telugu
Updated: April 18, 2020, 5:59 PM IST
ఇటలీలో ఎక్కువ మరణాలకు అసలు కారణం ఇదే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా ప్రభావం వృద్ధులపై ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇటలీలో మరణాల రేటు ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటలీ, స్పెయిన్‌ వంటి ఇతర యూరప్ దేశాల్లో 60 సంవత్సరాలు  వయసు దాటిన వారు దాదాపు 50 శాతానికి పైగా ఉన్నారు. అటు జర్మనీలో 60 ఏండ్లు పైబడిన వారు కేవలం 20 శాతం మంది ఉన్నారు. అదే జర్మనీ జనాభా సగటు వయసు 45.7 ఏండ్లు కాగా, 65 ఏండ్లు పైబడిన వారు 21 శాతం వున్నారు. జర్మనీలో వృద్ధుల జనాభా అధికంగా ఉన్నా కరోనా వైరస్ కోసం విస్తృత పరీక్షలు, ఐసొలేషన్‌, సోషల్ డిస్టన్స్ పాటించడం వంటి చర్యల ద్వారా ఆ దేశం ప్రాణనష్టాన్ని తగ్గించగలిగింది. జర్మనీలో ప్రతి లక్షమందికి 34 వెంటిలేటర్లు ఉన్నాయి. అదే ఇటలీలో కేవలం ఏడు మాత్రమే ఉన్నాయి.

కరోనా మహమ్మారి ఐరోపా దేశాలను అతలాకుతులం చేస్తున్నది. ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాల్లో మరణమృదంగం మోగిస్తున్నది. అయితే మిగిలిన ఐరోపా దేశాలతో పోలిస్తే జర్మనీ కరోనాను సమర్థంగా నిలువరిస్తోంది. ఇటలీ, బ్రిటన్‌లలో మరణాల రేటు 12 శాతం ఉండగా, జర్మనీలో కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నాయి. జర్మనీలో నాణ్యమయిన వైద్య విద్య, మౌలిక వసతులు ఉండటం కూడా ఒక కారణమనే చెప్పాలి.
Published by: Krishna Adithya
First published: April 18, 2020, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading