కరోనా వ్యాక్సిన్ రెడీ.. ఇటలీ ప్రకటన..

కరోనా వ్యాక్సిన్ రెడీ.. ఇటలీ ప్రకటన..

ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసమే ఎదురుచూస్తోంది. చాలా కంపెనీలు వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు సాధిస్తుండటంతో.. సాధ్యమైనంత తొందరగా కరోనాకు వ్యాక్సిన్ వస్తుందనే ఆశలు అందరిలోనూ కనిపిస్తున్నాయి.

రోనాపై ఉన్న కోపమో, ప్రతీకారమో గానీ వ్యాక్సిన్ తయారు చేసేందుకు పట్టుదలతో ఉన్నారు ఇటలీ శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ సిద్ధమైపోయిందని.. ఎలుకలపై చేసిన ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ప్రకటించారు.

  • Share this:
    కరోనా చేస్తున్న అల్లకల్లోలం అంతా ఇంతా కాదు.. ప్రపంచం గజగజ వణుకుతోంది. అన్ని దేశాల కంటే ముందుగా ప్రభావితం అయ్యింది చైనాయే అయినా.. ఇటలీకి తగిలిన దెబ్బ మామూలుది కాదు. ఆ దేశ పరిస్థితి ఓ దశలో అగమ్యగోచరంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత వైద్య సదుపాయాలు ఉన్న ఆ దేశం కరోనా ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, నెమ్మదిగా కోలుకొని ఇప్పుడు సాధారణ స్థితికి వస్తోంది. అయితే, కరోనాపై ఉన్న కోపమో, ప్రతీకారమో గానీ వ్యాక్సిన్ తయారు చేసేందుకు పట్టుదలతో ఉన్నారు అక్కడి శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ సిద్ధమైపోయిందని.. ఎలుకలపై చేసిన ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ప్రకటించారు.

    టకీస్ అనే సంస్థ దీన్ని సిద్ధం చేసి మానవ కణాలపై పనిచేసే ఎలుకల్లో దీన్ని ప్రయోగించిందని, ఈ వ్యాక్సిన్ యాంటీ బాడీలను ఉత్తత్తి చేసిందని వెల్లడించింది. వ్యాక్సిన్ తయారీలో ఇదో కొత్త ఫేజ్ అని అక్కడి మీడియా తెలిపింది. మానవ కణాలలో వైరస్ ను వ్యాక్సిన్ న్యూట్రల్ చేసిందని వివరించింది. తర్వలోనే మనుషులపై ప్రయోగం చేస్తామని, 100 శాతం కచ్చితంగా కరోనా అంతం అవుతుందని, తమకు వచ్చిన ఫలితాలు అంచనాలకు మించాయని శాస్త్రవేత్తలు చెప్పినట్లు వెల్లడించింది. అటు.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద సంస్థలు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి. భారత్‌లో దాదాపు ముప్పై వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: