కేవలం 2 వారాల్లో.. 10 లక్షల మందికి సోకిన కరోనా వైరస్

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 20,40,060 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. వారిలో వైరస్‌ పోరాడి 5,04,618 కోలుకోగా..1,30,917 మంది చనిపోయారు.

news18-telugu
Updated: April 15, 2020, 10:58 PM IST
కేవలం 2 వారాల్లో.. 10 లక్షల మందికి సోకిన కరోనా వైరస్
ప్రతీకాత్మక చిత్రం(credit - trackcorona.live)
  • Share this:
కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం విలవిల్లాడుతోంది. అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో జనం పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటి వరకు 20 లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం.. ఏప్రిల్ 2 వరకు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కేసులు నమోదయ్యాయి. ఐతే ఆ కేసుల సంఖ్య ఇవాళ్టికి (ఏప్రిల్ 15) నాటికి 20 లక్షలు దాటి పోయింది. ఈ లెక్కన కేవలం రెండు వారాల్లోనే 10 లక్షల మందికి ఈ వైరస్ సోకింది. వాస్తవానికి 2019 నవంబరు 17న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. ఏప్రిల్ 2 నాటికి ఆ సంఖ్య 10 లక్షలు చేరింది. అంటే మొదటి పది లక్షల కేసులకు నాలుగున్నర నెలల సమయం పడితే.. ఆ తర్వాతి 10 లక్షలకు కేవలం రెండు వారాలే పట్టింది. అంత వేగంగా ఈ కరోన రక్కసి విస్తరిస్తోంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 20,40,060 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. వారిలో వైరస్‌ పోరాడి 5,04,618 కోలుకోగా..1,30,917 మంది చనిపోయారు. ప్రస్తుతం 14,04,525 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో ఉన్న వారిలో 51,425 మంది పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలో 6,19,331 మందికి కరోనా సోకగా.. 27,176 మంది మరణించారు. స్పెయిన్‌లో 1,77,633 మంది కరోనా బారిన పడగా.. 18,579 చనిపోయారు. ఇక ఇటలీలో 1,65,155 మందికి కరోనా వైరస్ సోకగా..21,645 మంది మృత్యువాతపడ్డారు.
Published by: Shiva Kumar Addula
First published: April 15, 2020, 10:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading