HOME »NEWS »Corona vilayatandavam »it is not practical to send guest labourers to their states in buses saya kerala cm sk

బస్సులు వద్దు.. రైళ్లు నడపండి.. కేంద్రంపై రాష్ట్రాల ఒత్తిడి

బస్సులు వద్దు.. రైళ్లు నడపండి.. కేంద్రంపై రాష్ట్రాల ఒత్తిడి
(ప్రతీకాత్మక చిత్రం)

ప్రస్తుతం బస్సులను మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. రైళ్లలో వలస కూలీల తరలింపుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

  • Share this:
    వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలింపుపై గందరగోళం నెలకొంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో బస్సుల ద్వారా వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులను తరలించాలని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఐతే ఎండాకాలంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే కార్మికులు బస్సుల్లో ప్రయాణించడం సాధ్యం కాదని పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. బస్సులో 4, 5 రోజులు ప్రయాణించడం శ్రేయస్కరం కాదని.. కేంద్రమే ప్రత్యేక రైళ్లు నడపాలని అభిప్రాయపడ్డారు.

    వలస కార్మికులను తరలించాలని కేంద్రం కేవలం ప్రకటన చేస్తే సరిపోదు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సరైనవిగా లేవు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 2 కోట్ల మంది చిక్కుకున్నారు. వారంతా ఎండాకాలంలో మూడు నాలుగు రోజుల పాటు బస్సుల్లో ఎలా వెళ్తారు. బస్సుల కంటే రైళ్లు మేలు. కేంద్ర ప్రభుత్వం రైళ్లను నడిపి వలస కార్మికులను తరలించాలి.
    తలసాని శ్రీనివాస్ యాదవ్




    తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ సైతం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో 3.6 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని.. ఇంత ఎండల్లో సుదూర ప్రాంతాలకు వారిని బస్సుల్లో తరలించడం సాధ్యం కాదని చెప్పారు. బస్సుల్లో వెళ్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కేంద్రమే స్పెషల్, నాన్ స్టాప్ రైళ్లను నడపాలని విజ్ఞప్తి చేశారు. కేరళతో పాటు పలు ఇతర రాష్ట్రాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

    మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ వలస కార్మికుల తరలింపుపై రిపోర్టులు ప్రశ్నలు అడిగారు. వలస కార్మికులను తరలించేందుకు కేంద్ర ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుందా? అని అడగ్గా.. ప్రస్తుతం బస్సులను మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. రైళ్లలో వలస కూలీల తరలింపుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.


    Published by:Shiva Kumar Addula
    First published:April 30, 2020, 18:13 IST

    टॉप स्टोरीज