Home /News /coronavirus-latest-news /

IT ACT CASE FILE AGAINST TDP LEADER EX MINSTER SOMIREDDY CHANDHRA MOHAN REDDY NGS

Andhra Pradesh: మాజీ మంత్రిపై కేసు..ఫోర్జ‌రీ, దొంగతనం చేశారంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు

మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు

మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు

టీడీపీ నేతలను వరుస కేసులు వెంటాడుతున్నాయి.. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నేత సోమిరెడ్డిపై సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. ఆయనపై ఫోర్జరీ, దొంగతనం చేశారంటూ ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేశారు.

  మాజీ మంత్రి.. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. ఆయనపై కృష్ణపట్నం పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.శ్రేశిత టెక్నాలజీ ఎండీ నర్మదా రెడ్డి ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై చీటింగ్‌, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆనంద‌య్య మందును ఆన్‌లైన్‌లో పంపిణీ చేస్తున్నారని, ఆన్‌లైన్‌లో పంపిణీ పేరుతో కాకానీ కోట్లు సంపాదించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని సోమిరెడ్డి ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను శ్రేశిత టెక్నాల‌జీ ఎం.డీ న‌ర్మ‌ద కుమార్ ఖండించారు. తమ సంస్థపై సోమిరెడ్డి అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. తమ ప్రాజెక్ట్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన సోమిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. సోమిరెడ్డి తమ డేటా చోరీ చేశారని తెలిపారు. కాకాణికి, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని నర్మదారెడ్డి స్పష్టం చేశారు.

  న‌ర్మ‌ద కుమార్ ఫిర్యాదుతో సోమిరెడ్డిపై చీటింగ్‌, ఫోర్జ‌రీ, దొంగ‌త‌నం, ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు న‌మోదు చేశారు. మరోవైపు సోమవారం నుంచి ఆనంద‌య్య మందు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణ‌ప‌ట్నం ఎవ‌రూ రావొద్ద‌ని, అంద‌రికీ మందు అందేలా చేస్తామ‌ని అధికారులు చెబుతున్నారు.

  మరోవైపు మందు పంపిణీపై స్పందించిన ఆనందయ్య సైతం సోమిరెడ్డిపై ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశారు. కొంత ఇబ్బంది ఉన్న మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని..మొదట నియోజకవర్గంలో ఇచ్చి తర్వాత ఇతర ప్రాంతాలకు ఇద్దామని ఎమ్మెల్యేతో తానే చెప్పానని పేర్కొన్నారు. మందు పంపిణీపై సోమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని.. సోమిరెడ్డి మాట్లాడింది అవాస్తవమని విమర్శించారు. తమ సొంత గొడవలోకి తనను లాగవద్దని కోరారు. తనను ప్రజాసేవ కోసం ఉపయోగించుకోవాలని.. రాజకీయాల్లోకి లాగొద్దని మండిపడ్డారు. సోమవారం నుంచి ముందు పంపిణీ జరుగుతుందని… ఏవైనా పెద్ద ఆటంకాలు వస్తే తప్ప.. పంపిణీ ఆగదని పేర్కొన్నారు.

  అనందయ్య మందు పంపిణికి ఎలాంటి ఇబ్బంది లేదని నెల్లూరు ఇన్ చార్జ్ కలెక్టర్ హారింద్రప్రసాద్ పేర్కొన్నారు. కోర్టు, ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.. తాము ప్రత్యేకంగా ఇచ్చేది అంటూ ఎమీ లేదన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పెంచుతామని హామీ ఇచ్చారు.

  ఇదీ చదవండి : కుటుంబాన్ని బలితీసుకున్న బెట్టింగ్..? అప్పుల భారంతో బిడ్డలతో సహా ఆత్మహత్య

  కేసుల సంగతి ఎలా ఉన్న ఆనంద్య మందు మాత్రం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తతుం మందు పంపిణీ అంశం వైసీపీ వ‌ర్సెస్ టీడీపీగా మారిపోయింది.. వెబ్‌సైట్‌లో పెట్టి.. ఆనంద‌య్య బందును అమ్మి కోట్ల రూపాయాలు కొల్ల‌గొట్టాల‌ని చూస్తున్నారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మార‌గా.. సోమిరెడ్డి వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి.. ఆనందయ్య మందుకు దళారులుగా వ్యవహరించి, సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తే, ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవు అని హెచ్చ‌రించారు. క‌రోనా మందు తయారీ, పంపిణీ విషయంలో పూర్తి నిర్ణయాధికారం ఆనందయ్యదే తప్ప, ప్రభుత్వానికి గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ ఎటువంటి సంబంధంలేద‌న్న ఆయ‌న‌.. వస్తు రూపంలో ఇవ్వడం కానీ, ఆర్థిక సహాయం అందించాలన్న వారు గానీ వారు నేరుగా ఆనందయ్యకు తప్ప, మధ్యలో మరెవ్వరికీ, ఎంతటివారినైనా నమ్మి ఇవ్వొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Anandaiah corona medicine, Andhra prabha, AP News, CYBER CRIME, Somireddy chandramohan reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు