Home /News /coronavirus-latest-news /

ISRAEL STUDY SHOWS FOURTH DOSE COVID VACCINE SHOWS LIMITED RESULTS WITH OMICRON PVN

Covid Vaccine Fourth Dose : ఒమిక్రాన్ పై నాల్గవ డోసు టీకా ప్రభావం ఎంతంటే..ఇజ్రాయెల్ స్టడీలో ఆసక్తికర విషయాలు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Fourth Dose Vaccine On Omicron : ప్రపంచంలో తొలిసారిగా 60 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ వ్యాక్సిన్ నాల్గవ డోసు పంపిణీని ఇటీవల ప్రారంభబించిది ఇజ్రాయెల్. అయితే ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ఓమిక్రాన్ వేరియంట్‌పై నాల్గవ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ పరిమిత రక్షణను మాత్రమే అందిస్తుంది అని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయని ఇజ్రాయెల్ లోని షీబా హాస్పిటల్ తాజాగా ప్రకటించింది. యాంటీబాడీల స్థాయిలు పెరిగినప్పటికీ, నాల్గవ టీకా వైరస్ నుండి పాక్షిక రక్షణను మాత్రమే అందిస్తుంది అని షీబా హాస్పిటల్ ఇన్ఫెక్షన్ డిసీజ్ యూనిట్ డైరెక్టర్ డాక్టర్ గిలీ రెగెవ్ యోచాయ్ తెలిపారు.

ఇంకా చదవండి ...
Israel Study : ఒమిక్రాన్(Omicron) రూపంలో మళ్లీ ప్రపంచంపై కోవిడ్ పంజా విసురుతోంది. చాలా వేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. దీంతో యూరప్ సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే కోవిడ్ వ్యాప్తి మొదలయినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రికార్డు స్థాయిలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసును(Booster Dose) ప్రజలకు అందిస్తున్నాయి కొన్ని సంపన్న దేశాలు. ఇక,ఇజ్రాయెల్ సహా కొన్ని వేశాలు కోవిడ్ నాల్గవ డోస్ పై ఫోకస్ పెట్టాయి.

ప్రపంచంలో తొలిసారిగా 60 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ వ్యాక్సిన్ నాల్గవ డోసు(Vaccine Fourth Dose) పంపిణీని కూడా ఇటీవల ప్రారంభబించి ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌లో ఓమిక్రాన్ వేరియంట్‌తో రోగి యొక్క మొట్టమొదటి మరణం తరువాత ఈ నిర్ణయం తీసుకోబడిన విషయం తెలిసిందే.

అయితే ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ఓమిక్రాన్ వేరియంట్‌పై నాల్గవ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ పరిమిత రక్షణను మాత్రమే అందిస్తుంది అని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయని ఇజ్రాయెల్ లోని షీబా హాస్పిటల్ తాజాగా ప్రకటించింది. షీబా హాస్పిటల్.. గత నెలలో 270 మందికి పైగా వైద్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ నాల్గవ డోసును అందించడం ప్రారంభించింది. 154 మంది ఫైజర్ వ్యాక్సిన్‌ను పొందగా, 120 మంది మోడెర్నా వ్యాక్సిన్ ను పొందారు. అయితే గతంలో వీరందరూ ఫైజర్ వ్యాక్సిన్‌ మూడు డోసులు తీసుకున్నారు.

కాగా,ఈ రెండు గ్రూపులు..గత సంవత్సరం మూడవ డోసు టీకా తీసుకున్న తర్వాత కంటే కొంచెం ఎక్కువగా యాంటీబాడీల్లో పెరుగుదలను చూపించినట్లు క్లినికల్ ట్రయల్ డేటాలో తేలింది. కానీ పెరిగిన యాంటీబాడీస్ ఓమిక్రాన్ వ్యాప్తిని నిరోధించలేదని పేర్కొంది. "యాంటీబాడీల స్థాయిలు పెరిగినప్పటికీ, నాల్గవ టీకా వైరస్ నుండి పాక్షిక రక్షణను మాత్రమే అందిస్తుంది అని షీబా హాస్పిటల్ ఇన్ఫెక్షన్ డిసీజ్ యూనిట్ డైరెక్టర్ డాక్టర్ గిలీ రెగెవ్-యోచాయ్ తెలిపారు. గత వేరియంట్లపై ప్రభావవంతంగా పనిచేసిన వ్యాక్సిన్లు..ఒమిక్రాన్ వేరియంట్ పై తక్కువ రక్షణను అందిస్తాయని డాక్టర్ గిలీ తెలిపారు.

ప్రాథమిక ఫలితాలు...60 ఏళ్లు పైబడిన జనాభాకు మరియు రెండవ బూస్టర్ షాట్‌ను అందించడానికి ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నలను లేవనెత్తాయి. ఇటీవలి వారాల్లో 5లక్షల మందికి పైగా ప్రజలు రెండవ బూస్టర్‌ కోవిడ్ వ్యాక్సిన్ నాల్గవ డోసు అందుకున్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ నహ్మాన్ యాష్ ఛానల్ 13 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.."నాల్గవ డోసు టీకా ప్రయత్నం తప్పు అని పరిశోధన అర్థం కాదు. "ఇది మూడవ బూస్టర్ ప్రారంభంలో ఉన్న యాంటీబాడీల స్థాయిని తిరిగి ఇస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది"" అని చెప్పారు. అయితే అదనపు బూస్టర్ ప్రచారాన్ని విస్తృత జనాభాకు విస్తరించాలా వద్దా అని అధికారులు చర్చిస్తున్నందున పరిశోధన పరిగణనలోకి తీసుకోబడుతుందని ఆయన అన్నారు.

కాగా,గతేడాది జనాభాకు విస్తృతంగా కోవిడ్ టీకాలు వేసిన దేశాల వరుసలో ఇజ్రాయెల్ ముందుంది. గత వేసవిలో బూస్టర్ డోసును అందించిన మొదటి దేశంగా కూడా ఇజ్రాయెల్ నిలిచింది. అయితే ఇజ్రాయెల్ యొక్క దూకుడు టీకా ప్రయత్నాలు ఇటీవలి వారాల్లో ఓమిక్రాన్ వ్యాప్తిని ఆపలేకపోయాయి. ఇజ్రాయెల్ లో రికార్డు స్థాయిలో ఇన్‌ఫెక్షన్ లకు ఒమిక్రాన్ కారణమవడమేకాకుండా ఎక్కువ మంది పేషెంట్లు ఆసుపత్రి పాలయ్యేలా చేసింది. అయినప్పటికీ తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి సంఖ్య మునుపటి కంటే తక్కువగా ఉంది.

ప్రారంభ అధ్యయనాలు అయితే, మునుపటి డెల్టా వేరియంట్ కంటే ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం తక్కువగా ఉందని చూపిస్తుంది. టీకా మరియు బూస్టర్ ఇప్పటికీ తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం మరియు మరణం నుండి బలమైన రక్షణను అందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరోవైపు ఒమిక్రాన్ కారణంగా ఇజ్రాయెల్ లో మళ్లీ ఆంక్షలు విధించబడ్డ విషయం తెలిసిందే. అయితే ఆర్థిక వ్యవస్థను కొనసాగించడంలో సహాయపడేందుకు వీలుగా దేశంలో విధించిన తప్పనిసరి క్వారంటైన్ వ్యవధిని ఏడు రోజుల నుంచి ఐదు రోజులకు కుదిస్తున్నట్లు మంగళవారం ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Covid vaccine, Omicron

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు