హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Booster Dose: కరోనా ప్రమాదాన్ని తగ్గిస్తున్న వ్యాక్సిన్ బూస్టర్ డోస్.. తాజా అధ్యయనంలో సంచలన ఫలితాలు..

Booster Dose: కరోనా ప్రమాదాన్ని తగ్గిస్తున్న వ్యాక్సిన్ బూస్టర్ డోస్.. తాజా అధ్యయనంలో సంచలన ఫలితాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ వ్యాప్తంగా రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా కరోనా మహమ్మారి ఉద్ధృతి పెద్దగా తగ్గడం లేదు. ఇప్పటికే కొన్ని పరిశోధనలు మూడో డోసు ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి. తాజాగా ఇజ్రాయిల్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మూడో డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత SARS-CoV-2 పాజిటివ్ ప్రభావం తగ్గిందని ఆ దేశంలో నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...

ప్రపంచ వ్యాప్తంగా రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా కరోనా మహమ్మారి ఉద్ధృతి పెద్దగా తగ్గడం లేదు. ఇప్పటికే కొన్ని పరిశోధనలు మూడో డోసు ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి. తాజాగా ఇజ్రాయిల్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మూడో డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత SARS-CoV-2 పాజిటివ్ ప్రభావం తగ్గిందని ఆ దేశంలో నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ మూడో డోసు సంక్రమణ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించిందని పేర్కొంది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెలువరించిన నివేదిక ప్రకారం.. మూడో డోసు తీసుకున్న 2 వారాల తర్వాత SARS-CoV-2 ప్రమాదం 10 రెట్లు తగ్గింది.

ఈ విషయాలను గుర్తించడానికి పరిశోధకులు హెల్త్ మెయింటనెన్స్ ఆర్గనైజేషన్ డేటాను ఉపయోగించారు. థర్డ్ డోస్ తీసుకున్న ఓ వారం తర్వాత పాజిటివ్ కేసులు సగానికి తగ్గాయని, రెండో వారం తర్వాత మరింత ప్రభావం చూపిందని నివేదించింది.

Smart Air-purifier: భారతీయుల ప్రతిభ.. మొక్కతో ఎయిర్‌ ప్యూరిఫయర్‌ తయారీ.. ఎలా పని చేస్తుందంటే? 

ఇజ్రాయెల్‌లో పెరుగుతున్న డెల్టా కేసులు..

డెల్టా వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందడంతో ఇజ్రాయిల్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సోమవారం గరిష్ఠంగా 10,947 కేసులు నమోదయ్యాయి. జులై 31 తర్వాత వృద్ధుల్లో పాజిటివ్ కేసులు వృద్ధి చెందుతున్నాయి. ఆర్ఎన్ఏ టీకా మూడో డోసు 60 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు అందిస్తున్నారు. ఆగస్టు 29న ఇజ్రాయిల్ 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు బూస్టర్ ప్రోగ్రామ్‌ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు 2.1 మిలియన్లకు పైగా ప్రజలు మూడో డోసు అందుకున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Telangana Crime News: పొలం విషయంలో గొడవ.. చివరకు భార్య కట్టుకున్న భర్తను ఏం చేసిందో తెలుసా..

కరోనా బూస్టర్లు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయనడంలో ఆశ్చర్యం లేదని జాన్స్ హాప్‌కిన్స్ వర్సిటీ ఎపిడెమియాజిస్ట్ డేవిడ్ డౌడీ చెప్పారు. ఎవరికైనా స్వల్పకాలిక రోగనిరోధక శక్తిని అందించడమే మీ లక్ష్యం అయితే, ఇందుకు మార్గం బూస్టర్ డోస్ అనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ప్రస్తుత టీకాలు డెల్టా వేరియంట్ కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయనే ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఈ బూస్టర్ షాట్ కొద్ది కాలానికే రక్షణ కవచంగా పనిచేస్తాయని, ఈ భద్రత ఎంతకాలం ఉంటుందనేది అస్పష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు.

కరోనా పరీక్షల డేటా విశ్లేషణ..

ఈ అధ్యయనం కోసం ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖతో పాటు విశ్వవిద్యాలయాల్లో 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 1.1 మిలియన్ల మంది సమాచారాన్ని మంత్రిత్వశాఖ డేటా బేస్‌లో విశ్లేషించారు. కోవిడ్-19 నిర్ధారణతో పాటు జులై 30, ఆగస్టు 22 మధ్య ప్రజలు బూస్టర్ అందుకున్నారో లేదో తెలుసుకున్నారు. దీని ద్వారా మూడో డోసు పొందిన 12 రోజుల తర్వాత కరోనా సంక్రమణ ప్రమాదం 10 రెట్లు తగ్గిందని వారు గుర్తించారు. రెండో డోసు తీసుకున్న కొంతకాలం తర్వాత 95 శాతం రక్షణను అందించిందని, వ్యాధి తీవ్రత ప్రభావం 15 రెట్లు తగ్గించిందని కనుగొన్నారు.

మకాబీ హెల్త్ కేర్ సర్వీసెస్(MHS)కు చెందిన కేఎస్ఎం రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, హెచ్ఎంఓ సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించాయి. అధ్యయనంలో హెచ్ఎంఓ సభ్యుల వివరాలను తీసుకున్నారు. ఈ బృందం ఆగస్టు మొదటి 3 వారాల్లో 40 ఏళ్లు పైబడిన 153,753 ఎంహెచ్ఎస్ సభ్యులపై నిర్వహించిన 182,076 ఛైన్ రియాక్షన్ పరీక్షల ఫలితాలను విశ్లేషించింది. కరోనా పాజిటివ్, నెగిటివ్ ఫలితాలను పోల్చింది. వ్యాక్సిన్ బూస్టర్ తీసుకున్న 7 నుంచి 13 రోజుల మధ్య పాజిటివ్ కేసులు 48 శాతం తగ్గాయి. కేవలం రెండో డోసుల అందుకున్న వారితో పోలిస్తే షాట్ తర్వాత 14 నుంచి 21 రోజుల తర్వాత ఈ అవకాశం 70 శాతం తగ్గింది.

Published by:Veera Babu
First published:

Tags: Corona, Pfizer Vaccine, Sanjeevani, Vaccinated for Covid 19

ఉత్తమ కథలు