Home /News /coronavirus-latest-news /

ISRAEL DETECTED NEW COVID VARIANT PVN

New Covid Variant : ఇజ్రాయెల్ లో కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు..ఆందోళనలో ప్రపంచం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

New Variant : కోవిడ్ ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మల్లీ అలజడి రేగింది. పలు దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్​ దడపుట్టిస్తోంది. కొవిడ్‌ భయాలతో చైనాలోని చాంగ్‌చున్‌, షెన్‌జెన్‌ సహా పలు ప్రధాన నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. మరోవైపు దక్షిణకొరియాలోనూ కరోనా బుసలు కొడుతుంది.

ఇంకా చదవండి ...
New Variant In Israel  :  కోవిడ్ ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మల్లీ అలజడి రేగింది. పలు దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్​ దడపుట్టిస్తోంది. కొవిడ్‌ భయాలతో చైనాలోని చాంగ్‌చున్‌, షెన్‌జెన్‌ సహా పలు ప్రధాన నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. మరోవైపు దక్షిణకొరియాలోనూ కరోనా బుసలు కొడుతుంది. దక్షిణ కొరియాలో కొవిడ్​ కేసులతో పాటు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితులు నెలకొన్న సమయంలోనే తాజాగా ఇజ్రాయెల్‌ లో కొత్త కరోనా వేరియంట్‌ ను గుర్తించారు. ఇజ్రాయెల్ దేశంలో బుధవారం ఇద్దరు వ్యక్తుల్లో కరోనా కొత్త వేరియంట్‌ లక్షణాలు కనిపించాయి.

బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరిన ఇద్దరు ప్రయాణీకులకు పీసీఆర్‌ టెస్ట్‌ నిర్వహించగా కొత్త వేరియంట్‌ విషయం తెలిసిందని ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఒమిక్రాన్‌ కు చెందిన రెండు ఉప వేరియంట్‌లు బీఏ.1, బీఏ.2ను కొత్త వేరియంట్‌ కలిగి ఉన్నట్లు పేర్కొంది. రెండు స్ట్రెయిన్‌లు కలిగిన కొత్త వేరియంట్‌ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాలన్నట్లు వివరించింది. ఈ కొత్త వేరియంట్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు తెలియదని వెల్లడించింది.

ALSO READ Coronavirus : దక్షిణ కొరియాలో కరోనా సునామీ..ఒక్కరోజే 4లక్షల కేసులు

కాగా, రెండు వేరియంట్ల కరోనా గురించి తెలిసిందేనని, ఈ కొత్త వేరియంట్‌ వల్ల ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్‌ కరోనా ప్రతిస్పందన చీఫ్‌ సల్మాన్ జర్కా తెలిపారు. ఈ నేపథ్యంలో దీని వ్యాప్తి, కేసుల గురించి ఆందోళన చెందడం లేదన్నారు. కొత్త వేరియంట్‌ సోకిన ఇద్దరు రోగులకు ప్రత్యేక ట్రీట్మెంట్ కూడా అవసరంలేదని ఆయన అభిప్రాపడ్డారు. మరోవైపు, ఇజ్రాయెల్ లోని 9.2 మిలియన్ల జనాభాలో, 4 మిలియన్ల కంటే ఎక్కువ మందికి కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Coronavirus, Covid -19 pandemic, Israel, New varient

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు