ISOLATION FACILITY NOT MUST FOR ARRIVALS FROM COVID OMICRON AT RISK COUNTRIES SAYS CENTRE MKS
Covid Omicron:రిస్క్ దేశాల నుంచి వచ్చేవాళ్లు ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండక్కర్లేదు!: కేంద్రం
ప్రతీకాత్మక చిత్రం
వైరస్ వ్యాప్తి కట్టడికి ఓవైపు కఠిన చర్యలకు దిగుతూనే, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా ప్రభుత్వాలు జాగ్రత్త వహిస్తున్నాయి. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ లో కరోనా వైరస్ మూడో వేవ్ వెల్లువలా కొనసాగుతోంది. రోజువారీ కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి కట్టడికి ఓవైపు కఠిన చర్యలకు దిగుతూనే, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా ప్రభుత్వాలు జాగ్రత్త వహిస్తున్నాయి. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో జరిపిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం తప్పనిసరి కాదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
రిస్క్ దేశాల నుంచి వచ్చే వారు సాధారణ కొవిడ్ ప్రోటోకాల్ అనుసరిస్తే సరిపోతుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. కొత్త నిబంధనలు జనవరి 22న అమలులోకి వస్తాయని వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీటినే అమలు చేయాలని అధికారులకు సూచించింది. అయితే సవరించిన మార్గదర్శకాలు మినహా మిగతా నిబంధనల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి కూడా తాజా నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.
స్క్రీనింగ్ సమయంలో వైరస్ లక్షణాలను గుర్తించినట్లయితే ఆ ప్రయాణికులు వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లాలని కొవిడ్ ప్రొటోకాల్ చెబుతోంది. అంతేగాకుండా వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను కూడా గుర్తించి పరీక్షలు నిర్వహించాలి. భారత్‌కు వచ్చిన విదేశీయులు కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత ఏడు రోజులు హోం క్వారెంటైన్లో ఉండాలి. 8వ రోజు నెగటివ్ వచ్చిన తరువాత కూడా వారు మరో 7 రోజులు స్వీయ నిర్బంధంలోనే ఉండాల్సి ఉంటుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.