ఇకపై సంగం ధరకే ... తిరుమల లడ్డు ప్రసాదం

ఇకపై సంగం ధరకే ... తిరుమల లడ్డు ప్రసాదం

రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాలలోని కళ్యాణ మండపాల్లో లడ్డు ప్రసాదం 25వ తారీఖు నుండి అందుబాటులో ఉంటుందని టీటీడీ అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు..

  • Share this:
    తిరుమల : కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో గత రెండు నెలలకు పైగా శ్రీవారి దర్శనంకు భక్తుల అనుమతిని తాత్కాలికంగా నిలిపి వేసిన విషయం తెలిసిందే..ఈ నేపధ్యంలో భక్తుల కోరిక మేరకు రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాలలోని కళ్యాణ మండపాల్లో లడ్డు ప్రసాదం 25వ తారీఖు నుండి అందుబాటులో ఉంటుందని టీటీడీ అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాభనష్టాలను పక్కన బెట్టి భక్తులకు స్వామి వారి ప్రసాదం అందించాలని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నిర్ణయం మేరకు ప్రతి జిల్లాలోని టిటిడి కళ్యాణ మండపాల్లో పని చేసే టీటీడీ సిబ్బంది, ధర్మప్రచార పరిషత్ సిబ్బంది, శ్రీవారి సేవకులు టీంగా ఏర్పాటు చేసి లడ్డు ప్రసాదం వితరణకు ఏర్పాట్లు చేస్తున్నాంమని ఆయన తెలిపారు.. ప్రతి జిల్లా కేంద్రంలో 15 నుంచి 20వేల లడ్డూలను భక్తులకు మొదటి దశలో అందించేందుకు ఏర్పాట్లు చేసాంమని, ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలకు రెండు ట్రక్కులను పంపించాంమని, రేపు మిగిలిన జిల్లాలకు లడ్డులను ట్రక్కుల ద్వారా పంపిణీ చేస్తాంమని, కరోనా మహమ్మారి ప్రభావంతో స్వామి వారి ప్రసాదం అందరికి చేరాలని ₹:25 రూపాయలకు స్వామి వారి లడ్డులను అందిస్తున్నాంమని ఆయన తెలిపారు.. స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు..
    Published by:Venu Gopal
    First published: