కరోనా వైరస్ రక్షణ కోసం కొత్త పాలసీలు... ఇవీ లాభాలు

కరోనా వైరస్ రక్షణ కోసం కొత్త పాలసీలు... ఇవీ లాభాలు (ప్రతీకాత్మక చిత్రం)

IRDAI Coronavirus Policy | కరోనా వైరస్ బారిన పడితే ఆస్పత్రి ఖర్చుల కోసం ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? రెండు కొత్త పాలసీలు రాబోతున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకోవాలనుకుంటున్నారా? జూలై 10 నుంచి కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI రెండు స్టాండర్డ్ పాలసీలను అందించాలని ఇన్స్యూరెన్స్ కంపెనీలను ఆదేశించాయి. ఈ రెండు పాలసీ ఫీచర్లు, నియమనిబంధనల్నీ వివరించాయి. కరోనా వైరస్ మహమ్మారి భారతదేశంలో విజృంభిస్తున్నందున ఈ వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు ఈ పాలసీలను రూపొందించింది ఐఆర్‌డీఏఐ. అన్ని జనరల్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు రీ-ఇంబర్స్‌మెంట్ బేస్డ్ స్టాండర్డ్ కోవిడ్ 19 పాలసీ అందించడం తప్పనిసరి.

    Coronavirus: ఆయుర్వేదంతో ఇమ్యూనిటీ పెంచుకోండి ఇలా... ఆయుష్ మంత్రిత్వ శాఖ టిప్స్

    Coronavirus: హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ పాయింట్స్ మర్చిపోవద్దు

    ఐఆర్‌డీఏఐ రూపొందించిన కోవిడ్ 19 పాలసీల్లో 'కరోనా కవచ్' ఒకటి. ఈ పాలసీ తీసుకున్నవారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా పాలసీలో కవర్ అవుతుంది. పాలసీ టెన్యూర్ 3.5 నెలల నుంచి 9.5 నెలల వరకు ఉంటుంది. పాలసీదారులు ఎంతమొత్తంలో బీమా తీసుకుంటే ఆస్పత్రి ఖర్చులో అంతవరకు రీ-ఇంబర్స్ చేసుకోవచ్చు. ఆస్పత్రి ఖర్చులతో పాటు పీపీఈ కిట్స్, గ్లోవ్స్, మాస్కులు, ఆయుష్ ట్రీట్మెంట్ కూడా ఇందులో కవర్ అవుతుంది. పల్స్ ఆక్సిమీటర్, ఆక్సిజన్ సిలిండర్, నెబ్యులైజర్లు కూడా కవర్ అవుతాయి. 14 రోజుల వరకు హోమ్ కేర్ ట్రీట్మెంట్ కూడా కవర్ అవుతుంది. కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.5,00,000 వరకు 'కరోనా కవచ్' పాలసీ తీసుకోవచ్చు. హెల్త్ కేర్ వర్కర్స్‌కి 5 శాతం డిస్కౌంట్ ఉంటుంది.

    EPF: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల వరకు ఇన్స్యూరెన్స్

    TRAI App: గుడ్ న్యూస్... మీ కేబుల్, డీటీహెచ్ బిల్లుల్ని తగ్గించేందుకు ట్రాయ్ కొత్త యాప్

    ఇక ఈ పాలసీతోపాటు కరోనా రక్షక్ పేరుతో మరో పాలసీ ఉంది. ఇది సింగిల్ ప్రీమియం ప్లాన్. కోవిడ్ 19 పాజిటీవ్ అని తేలిన తర్వాత 72 గంటల్లో ఆస్పత్రి పాలైతే 100 శాతం క్లెయిమ్ చేసుకోవచ్చు. 105 రోజులు, 195 రోజులు, 285 రోజుల వరకు పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీని కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.2,50,000 వరకు తీసుకోవచ్చు. ఒక్కసారి క్లెయిమ్ చేసుకున్న తర్వాత పాలసీ పనిచేయదు.

    కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 65 ఏళ్ల వరకు వయస్సు ఉన్నవారు ఈ రెండు పాలసీలు తీసుకోవచ్చు. 3 నెలల నుంచి 25 ఏళ్ల లోపు డిపెండెంట్ చిల్డ్రన్ కూడా ఇందులో కవర్ అవుతారు. మొదటి పాలసీలో మాత్రమే ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్ ఉంటుంది. రెండు పాలసీల్లో 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే వెయిటింగ్ పీరియడ్‌లో క్లెయిమ్ చేసుకోవడం కుదరదు. ఈ రెండు పాలసీలు దేశమంతా అందుబాటులో ఉంటాయి.
    First published: