• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • IRDAI ALLOWS 29 HEALTH AND GENERAL COMPANIES TO OFFER AROGYA SANJEEVANI STANDARD HEALTH INSURANCE POLICY COVERS COVID 19 TREATMENT SS

COVID-19: ఆరోగ్య సంజీవని పాలసీలో కరోనావైరస్ చికిత్స

COVID-19: ఆరోగ్య సంజీవని పాలసీలో కరోనావైరస్ చికిత్స

COVID-19: ఆరోగ్య సంజీవని పాలసీలో కరోనావైరస్ చికిత్స (ప్రతీకాత్మక చిత్రం)

IRDAI Arogya Sanjeevani health insurance | కరోనా వైరస్ చికిత్స కవర్ అయ్యేలా హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఐఆర్‌డీఏఐ రూపొందించిన స్టాండర్డ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఆరోగ్య సంజీవని అందుబాటులోకి వచ్చింది.

  • Share this:
    మంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI రూపొందించిన స్టాండర్డ్ హెల్త్ పాలసీ 'ఆరోగ్య సంజీవని' ప్లాన్ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. భారతదేశంలోని 29 జనరల్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈ పాలసీని అందించనున్నాయి. ఈ హెల్త్ పాలసీలో విశేషమేంటంటే ఇందులో కరోనా వైరస్ చికిత్స కూడా కవర్ అవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందుతోంది. భవిష్యత్తులో ప్రైవేట్ ఆస్పత్రులో చికిత్స పొందాలన్నా, ప్రైవేట్ ల్యాబ్స్‌లో పరీక్షలు చేయించుకోవాలన్నా ఈ పాలసీ ఉపయోగపడుతుంది. కరోనా వైరస్ చికిత్సకు సంబంధించిన క్లెయిమ్స్ వస్తే వేగంగా సెటిల్ చేయాలని ఇన్స్యూరెన్స్ కంపెనీలను ఆదేశించింది ఐఆర్‌డీఏఐ.

    ఆరోగ్య సంజీవని స్టాండర్డ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో రూ.1,00,000 నుంచి రూ.5,00,000 కవరేజీ పొందొచ్చు. ఇండివిజ్యువల్ ప్లాన్‌తో పాటు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. 18 నుంచి 65 ఏళ్ల లోపు వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీతో వచ్చే లాభాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఆరోగ్య సంజీవని పాలసీని అందించే 29 కంపెనీలు ఇవే...


    1. ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    2. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    3. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    4. యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    5. స్టార్ హెల్త్ అండ్ అల్లైడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    6. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    7. భారతీ ఆక్సా జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    8. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    9. టాటా ఏఐజీ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    10. రహేజా క్యూబీఈ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    11. ఛోలా ఎంఎస్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    12. రెలిగేర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    13. మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    14. ఎడల్వీస్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    15. కొటక్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    16. ఫ్యూచర్ జనరలి ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    17. ఇఫ్కో టోకియో జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    18. నవీ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    19. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    20. మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    21. గో డిజిట్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    22. లిబర్టీ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    23. బజాజ్ అల్లియాంజ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    24. రాయల్ సుందరం జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    25. నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    26. మాగ్మా జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    27. యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    28. ఓరియెంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    29. అక్కో జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్

    ఇవి కూడా చదవండి:

    Money Transfer: జన్ ధన్ అకౌంట్‌లోకి నేటి నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్... ఎవరికి ఎప్పుడంటే

    EMI moratorium: ఈఎంఐ వాయిదాకు అప్లై చేయండిలా...

    Digital Payments: ఈ పేమెంట్స్ అన్నీ ఇంటి నుంచే చేయొచ్చు
    Published by:Santhosh Kumar S
    First published: