IRCTC: ఏప్రిల్ 30 వరకు ఈ రైళ్లు బంద్... అధికారికంగా ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Private Trains | కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఐఆర్‌సీటీసీ ప్రైవేట్ రైళ్లు ఏప్రిల్ 30 వరకు రద్దయ్యాయి.

news18-telugu
Updated: April 8, 2020, 10:03 AM IST
IRCTC: ఏప్రిల్ 30 వరకు ఈ రైళ్లు బంద్... అధికారికంగా ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
IRCTC: ఏప్రిల్ 30 వరకు ఈ రైళ్లు బంద్... అధికారికంగా ప్రకటించిన ఐఆర్‌సీటీసీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఏప్రిల్ 30 వరకు ప్రైవేట్ రైళ్లు రద్దు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC అధికారికంగా ప్రకటించింది. వారణాసి-ఇండోర్ రూట్‌లో కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్, లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై రూట్లలో రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఐఆర్‌సీటీసీ నడుపుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఈ మూడు రైళ్లను ఏప్రిల్ 15 వరకు నిలిపివేసింది ఐఆర్‌సీటీసీ. కానీ ఏప్రిల్ 30 వరకు ఈ మూడు ప్రైవేట్ రైళ్లను నడపొద్దని నిర్ణయించిన ఐఆర్‌సీటీసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందును ఈ రైళ్లను నెలాఖరు వరకు రద్దు చేయాలని నిర్ణయించింది.


ఇప్పటికే ఈ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఫుల్ రీఫండ్ ఇస్తామని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ఇక ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ ఉన్నందున ఇప్పటికే భారతీయ రైల్వే నడిపే ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దైన సంగతి తెలిసిందే. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. లాక్‌డౌన్ ముగిస్తే ఏప్రిల్ 15 నుంచి ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. లాక్‌డౌన్ కొనసాగితే ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దవుతాయి. రైళ్లు ప్రారంభమైన తర్వాత రైల్వే స్టేషన్లలో, రైళ్లల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే భావిస్తోంది. దాంతో పాటు ప్లాట్‌ఫామ్ టికెట్ ధరల్ని భారీగా పెంచడం ద్వారా రైల్వే స్టేషన్‌లో రద్దీ తగ్గించొచ్చని ఆలోచిస్తోంది.



ఇవి కూడా చదవండి:EMI Moratorium: హోమ్ లోన్ మారటోరియంతో రూ.2.34 లక్షల నష్టం... ఎందుకంటే

Online Banking Tips: ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

Jio Recharge: జియో యూజర్లకు గుడ్ న్యూస్... రీఛార్జ్ చేయండి ఇలా

 
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading