International Yoga Day 2020 : ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో నిర్వహించేవారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈసారి కరోనా ఉంది కాబట్టి... ఎలాంటి హంగామా లేకుండా... ఎవరి ఇళ్లలో వారు ఫ్యామిలీతో కలిసి యోగా చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్న ఆయన... అందరూ సోషల్ డిస్టాన్స్ పాటించాలని కోరారు. యోగాకు పాపులార్టీ పెరగడంపై ఎంతో ఆనందంగా ఉందన్న ఆయన... ఈ విపత్కర కాలంలో దీన్ని జరుపుకోవడం ఓ సవాలే అన్నారు. ఈసారి యోగా థీమ్... ఇంట్లోనే యోగా... కుటుంబంతో యోగా అని చెప్పిన మోదీ... ప్రపంచం కరోనాతో పోరాడుతున్న సమయంలో... యోగా... ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా ఉంటుందన్నారు.
వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో యోగా ఎంతో ఉపయోగపడుతుందన్న మోదీ... ఇది మైండ్ని చురుగ్గా చేస్తుందన్నారు. యోగా వల్ల అందరికీ రకరకాల ప్రయోజనాలు ఉంటాయన్నారు. మనల్ని మరింత బలంగా చేయడంలో యోగా ఉపయోగపడుతుందన్నారు. అందుకే అందరూ యోగా చెయ్యాలని మోదీ కోరారు. యోగాలో ప్రజలు కొత్త కొత్త ఆసనాలు కనుక్కోవాలని మోదీ కోరారు. కరోనా మన ఐకమత్యాన్ని దూరం చెయ్యలేదన్న మోదీ... యోగాతో ఆరోగ్యాన్ని పెంచుకుందామని కోరారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.