Home /News /coronavirus-latest-news /

INTERNATIONAL NEWS COVID 19 POPULATION IN UK MAY HAVE DEVELOPED SUFFICIENT HERD IMMUNITY SAYS OXFORD UNIVERSITY STUDY MK

గుడ్ న్యూస్... హర్డ్ ఇమ్యూనిటీతో సాధారణ జలుబు స్థాయికి కోవిడ్ పడిపోయే చాన్స్...UKలో సక్సెస్...

కరోనా

కరోనా

కరోనా వైరస్ పునరావృతం కాకుండా నిరోధించడానికి సహాయపడే హర్డ్ ఇమ్యూనిటీ శక్తి (హెచ్ఐటి) వల్ల జలుబు, వంటి కాలానుగుణ జబ్బుల స్థాయికి కరోనా వైరస్ తగ్గిపోయేందుకు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

UK జనాభాలో తగినంత స్థాయిలో హర్డ్ ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు, ఇది దేశంలో రెండవ రౌండ్ కరోనా వైరస్ మహమ్మారిని నివారిస్తుందని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనలో ప్రొఫెసర్ సునేత్రా గుప్తా ప్రముఖ పాత్ర పోషించారు. గుప్తా, మరో ముగ్గురు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ సహచరులతో ప్రచురించిన రీసెర్చ్ పేపర్ లో భయంకరమైన కరోనా వైరస్ పునరావృతం కాకుండా నిరోధించడానికి సహాయపడే హర్డ్ ఇమ్యూనిటీ శక్తి (హెచ్ఐటి) వల్ల జలుబు, వంటి కాలానుగుణ జబ్బుల స్థాయికి కరోనా వైరస్ తగ్గిపోయేందుకు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

అంటువ్యాధి ప్రబలిన ప్రాంతంలో హర్డ్ ఇమ్యూనిటీ శక్తి 50 శాతం ఎక్కువ..
50 శాతం వరకు ఏదైనా మహమ్మారి ప్రాంతంలో SARS-CoV-2 (COVID-19) పునరావృతం కాకుండా నిరోధించడానికి హెర్డ్ ఇమ్యునిటీ థ్రెషోల్డ్ (HIT) అవసరమని విస్తృతంగా నమ్ముతారు. అయితే అది ప్రస్తుతం ఆ దిశగా కోవిడ్ కదులుతోంది. కాలానుగుణ కరోనా వైరస్ నుండి రక్షణ ఉన్నందున జనాభాలో కొంత భాగం వైరస్ ప్రసారం చేయలేకపోతే దాన్ని పెద్ద ఎత్తున తగ్గించవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

కొత్త సిద్ధాంతం, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులు, నిరోధక శక్తి లేని వారితో కలిపినప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ థ్రెషోల్డ్ (HIT)లో గణనీయమైన క్షీణత ఉందని పేర్కొన్నారు.

యాంటీబాడీ పరీక్షను పెంచడంపై దృష్టి పెట్టండి
ఇదిలా ఉంటే ప్రొఫెసర్ గుప్తా ఇదే విషయమై మాట్లాడుతూ... UK జనాభాలో తలెత్తిన కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని గుర్తించే విధంగా యాంటీబాడీ పరీక్షను పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

కాలానుగుణ కరోనా వైరస్ క్లినికల్ లక్షణాల నుండి రక్షిస్తుందని మంచి ఆధారాలు ఉన్నాయని గుప్తా మరియు అతని సహచరులు నోట్‌లో పేర్కొన్నారు. కాబట్టి SARS-CoV-2 కలిగి ఉండటం వలన క్లినికల్ రోగనిరోధక శక్తి తగినంత స్థాయిలో లభిస్తుందని అనుకోవడం సమంజసం.
Published by:Krishna Adithya
First published:

Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు