Yellow Tongue: పసుపు పచ్చగా బాలుడి నాలుక.. ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త వ్యాధులు

ఎల్లో నాలుక

కరోనా రెండో దశ కూడా ముగిసిందని అంతా సంతోష పడుతున్న వేళ కొత్త కొత్త జబ్బులు భయపెడుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రభావం చూపే వైరస్ పెరగం కలరపెడుతోంది. ఇంతకీ ఈ కొత్తరకం అనారోగ్యం ఏంటో తెలుసా..?

  • Share this:
    ఇప్పటికే కరోనా వైరస్ తొలి, రెండు దశలతో ప్రపంచం గజగజా వణికింది. ఇంకా భయపడుతూనే ఉంది. కరోనా ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కొత్త కొత్త వేరియంట్లు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. తాజాగా మరో వ్యాధి కలకలం రేపుతోంది. అసలు ఏ వేరియంట్ ఎప్పుడు.. ఎక్కడ వస్తోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ కొత్త రకాల వ్యాధులు మనుషల ప్రణాలతో ఆటలాడుతున్నాయి. ఆ వ్యాధి తీవ్రత, లక్షణాలు గుర్తించలేక వైద్యులు కూడా తలలు పట్టుకోవాల్సి వస్తోంది. అది గుర్తించే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో మనకు కనిపించాయి. అందుకే మనిషి ఆరోగ్యంలో కాస్త తేడా కనిపించిన భయపడాల్సి వస్తోంది. ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా మరో కొత్త రకం వ్యాధి బయటపడినట్టు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు చిన్నారులపై ఈ కొత్త కొత్త వ్యాధులు ప్రభావం చూపుతుండడంతో భయపడేలా చేస్తోంది.

    తాజాగా కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇదో అరుదైన ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ అని వైద్యులు అంటున్నారు. దీంతో అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని డాక్లర్లు సూచిస్తున్నారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. బాలుడు గొంతు నొప్పి, మూత్రంలో సమస్య, కడుపు నొప్పి, చర్మంలో తేడా రావడంతో ఆస్పత్రికి వెళ్ళాడు. కొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత బాలుడుకి రక్తహీనత ఉందని, ఎప్సీన్‌ బార్ వైరస్ బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు.

    అంతేకాదు బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇది ఓ అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని తెలిపారు. ఇది అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని వెల్లడించారు. కాగా యూఎస్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి వల్ల రక్తహీనత, ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం కావడం, కామెర్లను కలిగిస్తుంది. అయితే బాలుడికి చికిత్సలో రక్త మార్పిడి, రోగనిరోధక వ్యవస్థ కార్యకలాపాలను తగ్గించడానికి ఏడు వారాల పాటు స్టెరాయిడ్లను ఉపయోగించారు. దీంతో బాలుడు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. నాలుక రంగు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుందని జర్నల్ ఆఫ్ మెడిసిన్ నివేదికలో పేర్కొంది.
    Published by:Nagesh Paina
    First published: