శ్రీకాకుళం కరోనా కేసుల్లో ఆసక్తికరం అంశం

ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. కానీ, విచిత్రంగా అతడి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది.

news18-telugu
Updated: April 25, 2020, 8:33 PM IST
శ్రీకాకుళం కరోనా కేసుల్లో ఆసక్తికరం అంశం
ప్రతీకాత్మక చిత్రం(credit - NIAID)
  • Share this:
ఇన్నాళ్లు ఒక్క కరోనా కేసు లేకుండా నెట్టుకొచ్చిన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారే మూడు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏపీలో నమోదైన 61 కొత్త కేసుల్లో మూడు శ్రీకాకుళం జిల్లాలోనివే. అయితే, ఈ మూడు కేసులు ఒకే ఇంట్లో నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన వ్యక్తి ఢిల్లీలో పనిచేసేవాడు. ఇటీవలే ఢిల్లీ నుంచి పాతపట్నం వచ్చాడు. జిల్లాలో అడుగుపెట్టిన సమయంలో పరీక్ష చేస్తే నెగెటివ్ రిపోర్టు వచ్చింది. తాజాగా పీసీఆర్ టెస్టు నిర్వహించగా, నెగిటివ్ గానే వచ్చింది కానీ, ఆశ్చర్యకరంగా అతడి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.

ఏపీలో కొత్తగా 61 కేసులు నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 1016కి చేరింది. అలాగే... కొత్తగా మరో ఇద్దరు చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 31కి చేరింది. ఇప్పటివరకూ 171 మంది డిశ్చార్జి అవ్వడంతో... ప్రస్తుతం 814 మంది కరోనాతో ఐసోలేషన్ కేంద్రాల్లో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. అలాగే... గత 24 గంటల్లో ప్రభుత్వం 6928 శాంపిల్ టెస్టులు జరపగా... వారిలో 61 మందికి కరోనా సోకినట్లు తెలిసింది. దేశంలో ఎక్కువ టెస్టులు జరుపుతున్న రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. జిల్లాల్లో చూస్తే... 275 కేసులతో కర్నూలు మొదటి స్థానంలో ఉండగా... 209 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జిల్లాలపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తోంది. అలాగే... కృష్ణా జిల్లాలో విజయవాడలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం సవాలుగా మారింది.
First published: April 25, 2020, 8:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading