ఇండియాలో ప్రధాన కరోనా మందుల తయారీకి ఆటంకం... అంతా చైనా వల్లే...

భారతదేశంలో తయారయ్యే చాలా మందుల ముడి సరుకులు... విదేశాల నుంచి వస్తాయి. మరి కరోనా మందుల విషయంలో తలెత్తిన సమస్యేంటి?

news18-telugu
Updated: June 30, 2020, 10:55 AM IST
ఇండియాలో ప్రధాన కరోనా మందుల తయారీకి ఆటంకం... అంతా చైనా వల్లే...
ఇండియాలో ప్రధాన కరోనా మందుల తయారీకి ఆటంకం...(credit - twitter - reuters)
  • Share this:
మన దేశంలో తయారవుతున్న మందులకు చాలా వరకూ ముడి పదార్థాలు చైనా నుంచి వస్తున్నాయి. జూన్ 22 నుంచి దేశంలోని అన్ని ప్రధాన ఓడ రేవుల్లో చైనా నుంచి వచ్చే దిగుమతులను కస్టమ్స్ అధికారులు ఆపేశారు. ఆ సరుకుల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిలో... మందుల తయారీకి అవసరమైన ముడి సరుకులు కూడా ఉన్నాయి. అవన్నీ విమానాల్లోనే ఉండిపోయాయి. అధికారులు వాటికి అనుమతి ఇవ్వట్లేదు. ముఖ్యంగా కరోనాను ఎంతో కొంత కంట్రోల్ చేస్తున్న రెమ్‌డెసివిర్, ఫావిపిరావిర్ మందుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు ఇప్పుడు ఆ ఎయిర్ కార్గోలోనే ఉండిపోయాయి. అందువల్ల వాటి ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో... ఈ మందుల తయారీ అత్యవసరంగా మారింది. ముడి పదార్థాలకు వెంటనే అనుమతి ఇవ్వాలని ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్... కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వెంటనే అనుమతి ఇవ్వకపోతే... మందుల తయారీ ఆలస్యమై... అది కరోనా పేషెంట్లకు సమస్యగా మారుతుందని తెలిపింది.

ఐదు రోజులుగా ముంబై ఎయిర్ కార్గోలో ఆ రెండు మందుల ముడి పదార్థాలు నిలిచిపోయాయని... ఇలాంటి వాటిని దిగుమతి చేసుకునే సంస్థ మైలాన్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనాయే అతి పెద్ద సమస్య కాబట్టి... దీనిపై కేంద్రం చొరవ చూపాలని అధికారులు కోరుతున్నారు. రెమ్‌డెసివిర్, ఫావిరావిర్ మందులు కరోనా నివారణలో బాగా పనిచేస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. అందువల్ల ఈ మందులతో తయారుచేస్తున్న రెండు బ్రాండ్లను పేషెంట్లకు ఇచ్చేందుకు అనుమతి లభించింది. జూన్ 22 నుంచి అధికారులు 30 శాతం ఫార్మా దిగుమతులను మాత్రమే పరిశీలించి రిలీజ్ చేశారు. ముంబై, చెన్నై ఓడరేవుల్లో కూడా వంద శాతం చెకింగ్ తర్వాత క్లియరెన్స్ ఇస్తున్నారు.

ఇలా లేట్ అయ్యేకొద్దీ మందుల తయారీ ఆలస్యం కానుంది. దీనికి తోడు... ఆయా ముడి సరుకులకు గ్రౌండ్ రెంట్, డెమ్మురేజ్ కాస్ట్ వంటి అదనపు ఖర్చులు కూడా అవూుతున్నాయి. అందువల్ల మందుల రేట్లు కూడా పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఆత్మనిర్భర భారత్ కింద కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాలి గానీ... ఇలా సరికులు రాకుండా ఆలస్యం చేయడం సరికాదంటున్నారు. కానీ కేంద్రం... చైనా విషయంలో చాలా సీరియస్‌గా ఉంది. చైనాకి కలిసొచ్చేలా ఏదీ జరగకుండా జాగ్రత్త పడుతోంది. క్రమంగా పరిస్థితులన్నీ భారత్‌కి అనుకూలంగా మారేలా చేస్తోందంటున్నాయి కేంద్ర వర్గాలు.
First published: June 30, 2020, 10:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading