HOME » NEWS » coronavirus-latest-news » INDIGO CEO ANNOUNCES SALARY CUT FOR SELF AND EMPLOYEES AND AIR INDIA MAY FOLLOW SOON DUE TO CORONAVIRUS OUTBREAK SS

Coronavirus Effect: కరోనా వైరస్ ఎఫెక్ట్... వారి జీతాల్లో కోత

Coronavirus outbreak | కరోనా వైరస్ ప్రభావంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల జీతాల్లో కోత పడుతోంది. ఎయిర్ ఇండియా కూడా అదే దారిలో వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

news18-telugu
Updated: March 19, 2020, 4:37 PM IST
Coronavirus Effect: కరోనా వైరస్ ఎఫెక్ట్... వారి జీతాల్లో కోత
Coronavirus Effect: కరోనా వైరస్ ఎఫెక్ట్... వారి జీతాల్లో కోత (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ ప్రభావం అన్ని వ్యాపారాలపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా విమానయాన సంస్థలు డీలా పడిపోతున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్లను రద్దు చేయడం, ప్రయాణికులు బుకింగ్స్ చేసుకోకపోవడం, విమాన ప్రయాణాలు తగ్గిపోవడంతో ఏవియేషన్ సంస్థలు కష్టాలను ఎదుర్కొంటున్నాయి. దీంతో విమానయాన సంస్థలు నష్టాలను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇండిగో సీఈఓ రోనోజాయ్ దత్ తనతో పాటు ఉద్యోగులందరి జీతంలో 25 శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించడం ప్రస్తుతం విమానయాన కంపెనీలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఎయిర్‌లైన్స్ భారీగా నష్టపోతున్నాయి.

ఇండిగో మాత్రమే కాదు... భారత ప్రభుత్వానికి చెందిన ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా కూడా అదే బాట పట్టే అవకాశముంది. జీతాల్లో 5 శాతం కోత విధించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలన్న ప్రయత్నాలు కూడా ఫలించలేదు. క్యాబిన్ క్రూ ఫ్లయింగ్ అలవెన్సుల్ని తగ్గించడంతోపాటు ఎగ్జిక్యూటీవ్ పైలట్లకు ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్సుల్ని తొలగించింది. ఇంతలో కరోనా వైరస్ మరింత దెబ్బకొడుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా కరోనా వైరస్ దెబ్బతో మరింత కుదేలవుతోంది. నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 100 మంది పైలట్లను తొలగించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

Pan Card: పాన్ కార్డ్ కావాలా? 10 నిమిషాల్లో ఫ్రీగా తీసుకోండి ఇలా

Post Office Account: పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? ఈ రూల్స్ మారాయి

Credit Card: క్రెడిట్ కార్డుపై మీరు కట్టే వడ్డీ ఎంతో తెలిస్తే షాకే
Published by: Santhosh Kumar S
First published: March 19, 2020, 4:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading