ఇండిగో ఎయిర్‌లైన్స్ డాక్టర్లు, నర్సులకు శుభవార్త చెప్పింది. డొమెస్టిక్ ఫ్లైట్లలో 25% డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఏడాది చివరి వరకు డిస్కౌంట్ అమలులో ఉంటుందని ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది త్యాగాలను దేశమంతా కొనియాడుతోంది. కోవిడ్ వారియర్స్‌ను గౌరవిస్తూ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా కుకీ క్యాంపైన్ పేరుతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే మెడికల్ స్టాఫ్‌కు ఫ్లైట్ ఛార్జీల్లో 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. డాక్టర్లు, నర్సులు ఈ ఆఫర్‌ను పొందొచ్చు. డిస్కౌంట్ పొందేందుకు వేలిడ్ మెడికల్ ఐడీ చూపించాల్సి ఉంటుంది.
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా రెండు నెలల విరామం తర్వాత మే 25న డొమెస్టిక్ ఫ్లైట్లు మొదలైన సంగతి తెలిసిందే. కానీ ప్యాసింజర్ డిమాండ్ కాస్త తక్కువగానే ఉంది. ఒక ఫ్లైట్‌లో సగటను 91 మంది ప్రయామిస్తున్నారు. సాధారణంగా ఉపయోగించే A320 ఎయిర్‌క్రాఫ్ట్‌లో 180 సీట్లు ఉంటాయని, జూలై 1 నాటికి ప్యాసింజర్ లోడ్ 50 శాతం మాత్రమే ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.