Home /News /coronavirus-latest-news /

INDIAS PRIVATE HOSPITALS HAVE CANCELLED ORDERS FOR RUSSIA SPUTNIK V VACCINE AS THEY STRUGGLE TO SELL COVID 19 SHOTS GH SK

Sputnik V: స్పుత్నిక్ టీకాలు వద్దు.. ఆర్డర్లు రద్దు చేసుకుంటున్న ఆసుపత్రులు.. కారణమేంటి?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Sputnik V vaccines: హైదరాబాద్ లో 8 టీకా కేంద్రాలను నడుపుతున్న అవీస్ హాస్పిటల్స్ కూడా 10 వేల స్పుత్నిక్‌ డోసుల ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. ఐతే ఈ విషయంపై అవీస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశమంతటా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం రెండు టీకాలను (కోవిషీల్డ్, కోవాగ్జిన్) ఉచితంగా పంపిణీ చేస్తుంది. దీంతో పాటు థర్డ్ వేవ్ నిరోధించేందుకు రష్యాకు చెందిన స్పుత్నిక్‌-V వ్యాక్సిన్ ను కూడా దిగుమతి చేసుకుంటోంది. మొదట్లో భారత్ ఈ వ్యాక్సిన్ పై ఆసక్తి కనబర్చినప్పటికీ క్రమేణా దీనికి డిమాండ్ తగ్గిపోయింది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు స్పుత్నిక్‌ వ్యాక్సిన్ ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచే కోవిడ్ టీకాలు ఉచితంగా రావడం వల్ల ప్రత్యేకంగా స్పుత్నిక్‌ టీకాలను హాస్పిటళ్లు విక్రయించలేకపోతున్నాయి.

స్పుత్నిక్‌- V వ్యాక్సిన్‌కు డిమాండ్ తక్కువగా ఉండటం, అత్యంత శీతలీకరణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వచేయాల్సి ఉండటం లాంటి కారణాల వల్ల హాస్పిటళ్లు వ్యాక్సిన్ ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకుంటున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటీవలే మూడు పెద్ద ఆసుపత్రులు స్పుత్నిక్ వ్యాక్సిన్ ఆర్డర్లను నిలిపివేశాయని సమాచారం.

coronavirus: అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది.. కరోనాపై WHO కీలక  వ్యాఖ్యలు

"ఈ టీకాపై భారత వైద్య వర్గాలు ఆసక్తి కనబర్చడం లేదు. మేము 2500 డోసులకు సంబంధించిన ఆర్డర్‌ను రద్దు చేశాం. స్పుత్నిక్‌ కోసం ప్రత్యేకంగా ఆసక్తి చూపేవాళ్లు 1 శాతం మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు ఏ వ్యాక్సిన అయినా ఒకటే అనే భావనలో ఉన్నారు" అని పుణెలో భారతీ విద్యాపీఠ్ మెడికల్ కళాశాలకు చెందిన జీతేంద్ర ఓస్వాల్ అనే వైద్యాధికారి రాయిటర్స్‌కు తెలిపారు.

సంజీవనిగా నిలుస్తున్న వ్యాక్సిన్.. గుంటూరులో ఓ కుటుంబానికి టీకా అందక ఒకరు బలి

* స్పుత్నిక్‌ వాడకం తక్కువ..
మే నెల నుంచి గతవారం వరకు మనదేశంలో స్పుత్నిక్ టీకాలు ఆర్డర్ చేసిన ఆసుపత్రులు కేవలం 6 శాతం మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉంటే టీకాల్లో నాలుగో వంతు స్పుత్నిక్‌-V ఉండాలని, ఆ మేరకు వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌ను స్పుత్నిక్‌-5 వ్యాక్సిన్ ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని, ఏడాదికి దాదాపు 850 మిలియన్ డోసులు ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశీయ వాడకానికి బదులు ఎగుమతులపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే మద్దతుదారులు దీనికోసం ముందుకు వస్తున్నారు. భారతీయ కంపెనీలు స్పుత్నిక్‌ డోసులను తయారు చేయడం కూడా ప్రారంభించాయి.

Covid-19: అక్కడ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. కేరళ కన్నా అధికం.. ఏం జరుగుతోంది?

జూన్ నుంచి భారత డిస్ట్రిబ్యూటర్ రెడ్డీస్ ల్యాబ్స్.. 9,43,000 స్పుత్నిక్‌-V డోసులను పంపిణీ చేసింది. రష్యా నుంచి దాదాపు 3 మిలియన్ డోసులను దిగుమతి చేసుకుంది. అయితే ఇలా ఆర్డర్ రద్దు చేసుకున్న ఆసుపత్రులకు డబ్బు రిఫండ్ చేయడానికి సంస్థ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా స్పుత్నిక్‌-V మార్కెటింగ్ చేస్తున్న రెడ్డీస్ ల్యాబ్స్ భాగస్వామి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ అంశంపై స్పందించడానికి నిరాకరించింది.

* ఆస్ట్రాజెనెకా కంటే ఖరీదైంది..
భారత వ్యాక్సిన్ డ్రైవ్ లో ప్రధానమైంది ఆస్ట్రాజెనెకా(AZN.L). దీన్ని మన దగ్గర కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ టీకాను రెగ్యులర్ రిఫ్రిజిరేటర్లలో కూడా నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రైవేటు మార్కెట్ లో ఆస్ట్రాజెనెకా కాంటే స్పుత్నిక్‌ 47 శాతం ఖరీదైంది.

హైదరాబాద్ లో 8 టీకా కేంద్రాలను నడుపుతున్న అవీస్ హాస్పిటల్స్ కూడా 10 వేల స్పుత్నిక్‌ డోసుల ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. ఐతే ఈ విషయంపై అవీస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పుణెలో మరో ఆసుపత్రిలోనూ ఈ వ్యాక్సిన్ ఆర్డర్ రద్దు చేసింది. ప్రైవేటు విక్రయాల్లో స్పుత్నిక్‌ టీకాల కొనుగోళ్లు తీవ్రంగా పతనమవుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో అందిస్తున్న టీకాల్లో కోవిషీల్డ్ వాటా 88 శాతంగా ఉంది. బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను మిగతా వాటాగా ఇస్తున్నారు. ఈ రెండు వ్యాక్సిన్లను జనవరి మధ్య నుంచి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Coronavirus, Covid-19, Russia, Sputnik-V

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు